బిసి జనార్ధన్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన దీక్ష లో ప్రతిపక్షనేత చంద్రబాబు

విధాత :కోవిడ్ సమయంలోను ప్రభుత్వం ప్రజల ప్రాణాలను ఏ విధంగా కాపాడాలో ఆలోచన చేయకుండా రాజకీయ కక్షలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, నీచం. చాలా తీవ్రంగా ఖండిస్తున్నా.జనార్ధన్ రెడ్డి ముఠా తగాదాలు, గొడవలు, హింసలు ప్రేరేపించిన వ్యక్తికాదు. అభివృద్ధి, ప్రజల బాగోగుల కోసం అనునిత్యం పనిచేసిన వ్యక్తి. ఐదు సంవత్సరాల తన ఎమ్మెల్యే పదవి కాలంలో ఏనాడు తన సొంతం కోసం ఏది అడగలేదు. అనునిత్యం అభివృధ్ధిని కాంక్షించిన వ్యక్తి జనార్ధన్ రెడ్డి. […]

  • Publish Date - May 26, 2021 / 12:09 PM IST

విధాత :కోవిడ్ సమయంలోను ప్రభుత్వం ప్రజల ప్రాణాలను ఏ విధంగా కాపాడాలో ఆలోచన చేయకుండా రాజకీయ కక్షలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, నీచం. చాలా తీవ్రంగా ఖండిస్తున్నా.
జనార్ధన్ రెడ్డి ముఠా తగాదాలు, గొడవలు, హింసలు ప్రేరేపించిన వ్యక్తికాదు. అభివృద్ధి, ప్రజల బాగోగుల కోసం అనునిత్యం పనిచేసిన వ్యక్తి. ఐదు సంవత్సరాల తన ఎమ్మెల్యే పదవి కాలంలో ఏనాడు తన సొంతం కోసం ఏది అడగలేదు. అనునిత్యం అభివృధ్ధిని కాంక్షించిన వ్యక్తి జనార్ధన్ రెడ్డి.

నూతన రాజకీయాలకు నాంధి పలికిన వ్యక్తి. సొంత డబ్బులు ఖర్చు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నమ్ముకున్న సిద్దాతం కోసం కట్టుబడి పోరాటం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా అదే. తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలో ముఠారాజకీయాలు గానీ, తీవ్రవాద రాజకీయాలు గానీ, మత రాజకీయాలు గానీ ఉండకూడదని అనేక చర్యలు తీసుకున్నాం. దీని వల్ల రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు తగ్గాయి. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్త రాజకీయం తీసుకొచ్చారు. అదే స్టేట్ టెర్రరిజం. కాటసాని రామిరెడ్డి చేసే భూ కబ్జాలు, అక్రమాలను అడ్డుకున్నందుకు జనార్ధన్ రెడ్డి మూడు కేసులు పెట్టారు. దీనికి పరాకాష్టే 23 వ తేది ఆదివారం చోటు చేసుకున్న సంఘటన. జనార్ధన్ రెడ్డి ఇంటి పరసర ప్రాంతాలకు వైసీపీ గుండాలు ఎందుకొచ్చారో లా అండ్ ఆర్ఢర్ ను అమలు చేసే పోలీసులు అధికారులు చెప్పాలి.

ట్రెస్ పాస్ చేసిన వాళ్లపై చర్యలు తీసుకోకుండా తిరిగి తెదేపా నాయకులపై కేసులు పెట్టడం చాలా దుర్మార్గం. వైసీపీ గుండాలు తాగేసి బైక్ లపై వచ్చి పెద్ద ఎత్తున గొడవ చేస్తే వారిని వదిలి పెట్టి పోలీసులు చేతగాని వాళ్లులా తయారయ్యారు. దాడి చేయడానికి వచ్చిన వారిని అడ్డుకున్నందుకు బిసి జనార్థన్ రెడ్డి ఏ1 గా పెట్టి శ్రీను, దివాకర్, విజయరెడ్డి, పెద్దహుస్సేన్, మురళీమోహన్ రెడ్డి, రమణ, నరసింహ, అత్తార్ హుస్సేన్ లు అనబడే మరో ఎనిమిది మందిపై కేసులు పెట్టారు. పోలీసులకు ఏ మాత్రం బుద్ధి, జ్జానం ఉన్న ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి ఆధారాలు ఎమున్నాయో చెప్పాలి. ఒకవైపు కోవిడ్ కారణంగా వందలమంది ప్రజలు చనిపోతుంటే మరో ప్రక్క ఏకపక్షంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తారా? బ్లాక్ ఫంగస్ తో ప్రజలకు మందులు కూడా దొరకని పరిస్థితి ఉంది.

కరోనాని కట్టడి చేయలేని ముఖ్యమంత్రి తెలుగుదేశం పైన దాడులు చేస్తూ పైశాచిక ఆనంధం పొందుతున్నాడు. నా నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఏ ముఖ్యమంత్రి కూడా జగన్ అంత హీనంగా ప్రవర్తించిన వాళ్లు లేరు. ఇరవై మూడవ తేది అరెస్టు చేసి జనార్ధన్ రెడ్డి ని ఆన్ లైన్ కోర్టు ముందు హజరు పరిచి ఆదోని జైల్ కు పంపిన పోలీసులు మిగతా 8 మందిని పోలీస్ కస్టడీలోనే ఎందుకు ఉంచారు? రఘురామకృష్ణం రాజు విషయంలో ఏ జరిగింది పోలీసులు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నా.

సుఫ్రీంకోర్టు సైతం పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చేందుకు కూడా అనుమతించలేదంటే ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం సిగ్గు ఉన్నా ఈ విధంగా ప్రవర్తిస్తారా? పోలీసు కస్టడీలో పోలీసులు హింసకు పాల్పడితే పోలీసులు సైతం జైలుకు వెళ్లాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న అధికారులు జైలుకు వెళ్లివచ్చారు. పోలీసులు కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంటే అదేమాదిరిగా వ్యవహరించడం. పోలీసులు చేసే దుర్మార్గపు చర్యలకు వడ్డీతో సహా చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైసీపీ నాయకులు, పోలీసులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం పార్టీపై దాడులు చేస్తే కార్యకర్తలు బయపడుతారని అనుకుంటున్నారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలను బయపెట్టడం ఎవరి వల్ల కాదు.

అరెస్టు చేసిన వారిని 24 గంటల లోపు ఎందుకు జుడీషియల్ సబ్ మిషన్ ఎందుకు చేయలేదు.? ఈ రాష్ట్రంలో మానవ హక్కులు ఉన్నాయా? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు బాడీకి కెమెరాలు పెట్టుకుని మాట్లాడే విధానాన్ని తీసుకొచ్చిన ఒక పోలీసు పారదర్శకత తీసుకొచ్చాం. కానీ ఈ రోజు ఎవరినీ లోనికి రానీకుండా కస్టోడియల్ టార్చర్ లు పెట్టే స్థాయికి దిగజారారు. రెండు పక్షాలను సమానంగా చూసినప్పుడు మాత్రమే లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంటుంది. లేదంటే ప్రతీకారం, రోషం, బాధ, ఆవేధన అన్యాయం జరిగిన పక్షాన నిలిచి హింస చెలరేగుతుంది. జనార్ధన్ రెడ్డి అంశంలోను పార్టీ ప్రైవేటు కేసు వేస్తుంది. పోలీసులు చట్టప్రకారం పనిచేసే వరకు తెలుగుదేశం ఎవరిని వదిలిపెట్టం. ఇరవైరెండేళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైసీపీ లా పనిచేసి ఉంటే వీళ్లు ఎక్కడ ఉండేవాళ్లో గుర్తుపెట్టుకోవాలి.

అచ్చెన్నాయుడుతో మొదలైన వైసీప అరాచకం జనార్ధన్ రెడ్డి వరకు వచ్చింది. ప్రతీ ఒక్కదానికి ప్రతిఫలం అనుభవించే రోజు వస్తుంది. ఆరోజు ఈ నాయకులను, అధికారులను ఎవరూ కాపాడలేరు. కొల్లు రవీంద్రను, జేసీ ప్రభాకర్ రెడ్డి, బీటెక్ రవిని, అనపర్తి రామకృష్ణ రెడ్డి, దూళిపాళ్ల నరేంద్ర ఇలా అందరిపైనా తప్పుడు కేసులు నమోదు చేశారు. ఇది ఒక్క జనార్ధన్ రెడ్డి విషయం మాత్రమే కాదు. తెలుగుదేశం కార్యకర్తలు దీన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఇష్టానుసారం వ్యవహరించాలనుకున్న చాలా మంది ఉన్మాదులు చట్టానికి చిక్కి శిక్ష అనుభవించారు తప్పా తప్పించుకున్న దాఖలాలు లేవు. గడియారం తిరుగుతూనే ఉంటుంది. మరలా ఒకరోజంటూ వస్తుంది…ఆ రోజు గుర్తుపెట్టుకోవాలని వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నా.

రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల పిల్లల్లో విష బీజాలు నటబడుతున్నాయి. ముఠీ కక్షల్లో తల్లిదండ్రలను కోల్పోయిన పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా పాఠశాలలు పెట్టి చదువులు చెప్పాం. కానీ వైకాపా నాయకులు మరలా వీటన్నింటినీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారు. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి ఆయనను పిచ్చివాడిని చేసి చివరకు చనిపోయే పరస్థితి తీసుకొచ్చారు. ఈ పాపం జగన్ మోహన్ రెడ్డిని వదిలిపెట్టదు. వివేకానంద రెడ్డి ని గొడ్డలితో నరికి చంపి హార్ట్ అటాక్ అని చిత్రీకరించాలని చూశారు. పల్నాడు పులిలా ఉండే కోడెల శివప్రసాద్ వైసీపీ హింసలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతకంటే దుర్మార్గులు ఉంటారా? కర్నూలు జిల్లాలోనే అబ్దుల్ సత్తార్ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు ప్రేరేపించిన వైసీపీ వాళ్లు మనుషులేనా అని అడుగుతున్నా. ఇన్ని జరిగినా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ ఏం కావులే అనే భ్రమలో వైసీపీ నేతలు ఉన్నారు.

కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే కరోనా మందులు కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. చివరకు ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేదం మందును సైతం పేదవారికి అందనీయకుండా రాజకీయాలు చేస్తూ తమ వారికి పంపుకుంటున్నారు. ఆనందయ్య మందులో తప్పులుంటే చెప్పాలి కానీ పేదవారిని కరోనా నుండి కాపాడుతున్న మందును నిలిపివేసి అడ్డుకోవడం మంచిది కాదు.
జగన్ పాలనలో కరోనాతో కుటుంబాలకు కుటుంబాలు కనుమరుగయ్యో పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రలు చనిపోయి పిల్లలు అనాధలుగా మిగిపోతున్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. రాష్ట్రం అదోపాతాళానికి పడిపోయింది. తెలుగు ప్రజలు సంక్షోభంలో కూరుపోతున్న ఈ తరుణంలో దానికి ఏం చేయాలో ఆలోచించకుండా కక్షసాధింపులకు పోతున్నారు.
తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ అక్రమ కేసులకు బయపడకుండా నిలదీస్తే ప్రజల సహకారం లభిస్తుంది. అప్పుడే వైసీపీ వాళ్లు వెనక్కు తగ్గుతారు. తెలుగుదేశం ఏనాడు తప్పు చేయలేదు. గ్రామస్థాయిలో ఉండే నాయకులు దగ్గర నుండి రాష్ట్ర స్థాయి నాయకులు వరకు వైసీపీ దుశ్చర్యలపై పోరాడాలి. ఏ కార్యకర్త అధైర్యపడాల్సిన పని లేదు. వైసీపీ నాయకులకు సహకరిస్తున్న పోలీసు అధికారులపై కూడా ప్రైవేటు కేసులు వేయాలి. వైసీపీ ప్రజాధనాన్ని లూటీ చేయడానికి రాజకీయాలలోకి వస్తే తెలుగుదేశం పార్టీ సొంత డబ్బులు పెట్టికుని రాజకీయాలు చేసింది.

రౌతు కొద్ది గుర్రం అన్నట్లు జగన్ పరిపాలన, వైసీపీ నాయకుల పరిపాలన ఉంది. ఖైదీలకు కూడా హక్కులున్నాయని గుర్తుపెట్టుకోవాలి. క్షణికావేశంలో తప్పులు చేసిన వారిని సైతం మనుషులుగా తీర్చిదిద్దాలని తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తే వైసీపీ ప్రభుత్వం మంచివారిని కూడా హింసించి హింసను ప్రేరేపిస్తున్నారు. కక్షా, కార్పణ్యాలు పెంచేలా చేస్తున్నారు. ఇది మంచిది కాదు. చట్టం కొంత మందికి చుట్టం కాదు అని చెప్పాల్సిన భాద్యత మనపై ఉంది.
రాష్ట్రంలో డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ జరుగుతుందని హైకోర్టు సైతం వ్యాఖ్యానించింది.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. కోర్టులపైనే దాడులకు దిగుతున్నారని నీలం సాహ్ని కేసులో హెచ్చరించింది. ఇంగ్లీషు చదవడం, రాయడం వచ్చిన ఒక సాధారణ వ్యక్తి సుప్రీంకోర్టు ఆదేశాలను అర్ధం చేసుకుని అమలు చేస్తారు. కానీ చీప్ సెక్రటరీగా పనిచేసి, ఎన్నికల కమీషనర్ గా ఉన్నా వ్యక్తికి అర్ధం కాలేదంటే ఆ పదవికి ఆమె అర్హురాలేనా అనే అనుమానం కలుగుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. నాలుగు వారాలు ఎన్నికల కోడ్ అమలులో ఉండాలనే నిబంధనను అనుసరించలేని వీళ్లు ఉన్నతాధికారులా?
బయపడితే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం. బ్రిటీషు వలసవాదులు కూడా వైకాపా ప్రవర్తించినంత ఉన్మాధంగా ప్రవర్తించలేదు. రఘురామకృష్ణం రాజు కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాధారణ పౌరుడైన, ఎంపీ అయినా పోలీసు కస్టడీలో హంసకు పాల్పడటం తప్పు అని చెప్పింది. ఈ విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాలి. జనార్ధన్ రెడ్డి ప్రజా సేవ కోసం చేస్తున్న పోరాటానికి మనందరం సహకారం అందించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఏ గ్రామంలో ఏ సంఘటన జరిగినా సంఘటితంగా పోరాడాలి.

60 లక్షల మంది సభ్యలు గల పార్టీ తెలుగుదేశం పార్టీ. మనందరం కలిసి ఈ దుర్మార్గమైన పాలనపైన పోరాటం చేయాలి. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కోర్టులు చుట్టూ తిరగడం కాదు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపైన కేసులు పెట్టిన వాళ్లు కూడా కోర్టులు చుట్టూ తిరగాలి. అప్పుడే ఆ భాధ వైసీపీ వాళ్లకు అర్ధం అవుతుంది. రఘురామకృష్ణం రాజు తిరగబడి ఈ దుర్మార్గులపై పోరాటం చేశాడు కాబట్టే ఆయన ఈ రోజు ఒక హీరోలా నిలబడ్డాడు. సిబిసిఐడి, ముఖ్యమంత్రి ఒక విలన్ లా తయారయ్యారు. ఇక్కడ కూడా తెలుగుదేశం కార్యకర్తలు అలాంటి పోరాటపఠిమ, చొరవ తీసుకోవాలి. దానికి పార్టీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. పోరాటం చేస్తే ఫలితం ఆలస్యమవుతుందేమో గానీ విజయం మాత్రం మనదే. నాడు బ్రిటీషు వాళ్లకే మనం తల వంచలేదు. తెలుగుదేశం నాయకులపై, కార్యకర్తలపై పెట్టే ప్రతీ కేసును లాజికల్ గా తీసుకెళుదాం. జనార్ధన్ రెడ్డి న్యాయపోరాటంలో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.

వర్చువల్ నిరసనలో పాల్గొన్న బిసి ఇంద్రారెడ్డి, అచ్చెన్నాయుడు, కర్నూలు పార్లమెంటు అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, జనగానపల్లె నియోజక వర్గ నాయకులు, కర్నూలు జిల్లా ముఖ్యనాయకులు, కార్యకర్తలు.