Site icon vidhaatha

ఇద్ద‌రు తెలుగు గ‌వ‌ర్న‌ర్ల‌కు ప‌వ‌న్ గ్రీటింగ్స్‌

విధాత:కంభంపాటి హ‌రిబాబు, బండారు ద‌త్తాత్రేయ‌ల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్ర గవర్నర్‌గా నియమితులు కావడం సంతోషకరమైన విషయమని పవన్ ఓ లేఖను విడుదల చేశారు. హరిబాబుకి జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఎంపీగా, ఎమ్మెల్యేగా విద్య, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ రంగాలపై దృష్టిపెట్టారన్నారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం అభివృద్ధిలో హరిబాబు అనుభవం ఎంతో దోహదపడుతుందనే విశ్వాసం ఉందన్నారు. హరియాణా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న బండారు దత్తాత్రేయకి పవన్ శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version