విధాత: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఏ1గా ఉన్న ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్ రావు కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు తనకు ముందస్తు బెయిల్ ఇస్తే.. అరెస్టు చేయకుండా ఉంటే హైదరాబాద్ కు వస్తానని.. విచారణకు హాజరవుతానని కోర్టుకు నివేదించాడు.
అయితే కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అని.. కేసు నమోదైన వెంటనే దేశం విడిచిపారిపోయాడని..కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేయించాడని సిట్ అధికారుల తరపు న్యాయవాది వాదించారు. అతనికి బెయిల్ ఇవ్వరాదని కోర్టుకు నివేదించారు. ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషనన్ కొట్టివేసింది. మరోవైపు ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొచ్చేందుకు సీబీఐ ద్వారా చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి.