Car Catches Fire On ORR : ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మంటలు..తప్పిన ప్రాణనష్టం

సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై శుభకార్యానికి వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఏడుగురు సకాలంలో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. కారు పూర్తిగా దగ్ధమైంది.

Car Catches Fire On ORR

విధాత, హైదరాబాద్ : ఓ వైపు కర్నూలు బస్సు ప్రమాదం ఘటనతో అంతా షాక్ గురైన సమయంలోనే సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ఎగ్జిట్ 3 వద్ద ఓ కారులో మంటలు చెలరేగడం కలకలం రేపింది. సిద్ధిపేట నుంచి శంకర్‌పల్లికి శుభకార్యానికి వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వారంతా సకాలంలో కారు దిగి బయటకు వెళ్లిపోయారు.

అటుగా వెళ్తున్న పటాన్‌చెరు బీఆర్‌ఎస్ నేత మాణిక్ యాదవ్ వారికి సహకరించారు. కారులోని కుటుంబ సభ్యులు అంతా సురక్షితంగా బయటపడగా, కారు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.