ధరణి దరిద్రం వల్లనే గత ప్రభుత్వం ఓడిపోయిందని, అందుకే దానిని రద్దు చేసి భూభారతి చట్టం తెచ్చామని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి ఇటీవల గొప్పలు చెప్పుకున్నారు. ఆచరణలో మాత్రం ధరణికి భూభారతికి ఏమీ తేడాలేదని భూయజమానులు, బిల్డర్లు వాపోతున్నారు. భూమి రికార్డుల్లో దిద్దుబాట్లు చేయడానికి గత ప్రభుత్వంలో ఏమి జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతున్నదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కలెక్టర్లు కనీసం కొన్ని సమస్యలయినా స్వతంత్రించి పరిష్కరించేవారని, ఇప్పుడు కలెక్టర్లు గుమస్తాలుగా వ్యవహరిస్తున్నారని ఒక భూయజమాని ఆవేదన వ్యక్తం చేశారు.
ధరణి వెళ్లి భూ భారతి పోర్టల్ వచ్చినా కష్టాలు తప్పడం లేదా?
రైతులకు అన్యాయం చేసిన ధరణిని బంగాళాఖాతంలో పడేసి.. న్యాయం చేసే విధంగా భూభారతి చట్టాన్ని తెచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊదరగొడుతున్నా.. భూభారతిలోనూ సమస్యలు అలానే పడి ఉంటున్నాయని, పైగా కమీషన్లతోనే పనులు అవుతున్నాయని రైతులు, బిల్డర్లు వాపోతున్నారు.
