అమరావతి : మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అంబటిపై నమోదైన అన్ని కేసులలో బెయిల్ మంజూరవ్వడంతో ఆయన బుధవారం జైలు నుంచి విడదల అయ్యారు. ఇటీవల చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలపైనే 36 కేసులు నమోదు కాగా, పోలీసుల విధులకు ఆటంకాలతో పాటు ఇతర వివాదాలపై మరో 16 కేసులు రాంబాబుపై నమోదయ్యాయి. సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా అవినీతి కేసులో ఈ రోజు అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
జైలు నుంచి విడుదైలన అనంతరం అంబటి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నా ఇంటిపై దాడి చేశారు. నన్ను హింసించారు. నా భార్య,పిల్లల్ని తరిమారు. నా కార్లను ధ్వంసం చేశారు. నా ఇల్లు తగలబెట్టేందుకు యత్నించారు. ఐ డోంట్ కేర్. బాధితుణ్ని లోపల పెట్టారు. నిందితుణ్ని వదిలారు. పార్టీలకు అతీతకంగా దాడిని ఖండించిన వారికి నా కృతజ్ఞతలు. దేవుడున్నాడు.. ధర్మమే గెలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.
అంతకుముందు ఎక్స్ వేదికగా అంబటి మరో పోస్టు పెట్టారు. ‘ఎన్ని కేసులు పెట్టినా అడుగు వెనక్కి వేసేది లేదు’.. అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ నాయకత్వంలో కూటమిని కూల్చేవరకు తన పోరాటం ఆగదంటూ ట్వీట్ లో స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
king of the jungle | వివాహ విందుకు ఊహించని అతిథులు.. ఫ్యామిలీతో వచ్చిన జంగిల్ కింగ్
Bride Showered With Rs 8.5 Crore | వధువుపై నోట్ల వర్షం.. నిజంగానే రూ.8.5 కోట్లు ఉపయోగించారా..?
