CPS vs OPS EHS | రిటైర్డ్ CPS ఉద్యోగులకు EHS అమలుపై స్పష్టతేది?

తెలంగాణ రాష్ట్రంలో సీపీఎస్‌ ఉద్యోగుల ఆరోగ్య పథకంపై స్పష్టత కరువైందని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావును వారు కలిసి, రాష్ట్రంలో ఉన్న 2.5 లక్షల సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఈహెచ్ఎస్ పై వినతిపత్రం సమర్పించారు.

CPS vs OPS Difference

CPS vs OPS EHS | తెలంగాణ రాష్ట్రంలో సీపీఎస్‌ ఉద్యోగుల ఆరోగ్య పథకంపై స్పష్టత కరువైందని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావును వారు కలిసి, రాష్ట్రంలో ఉన్న 2.5 లక్షల సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఈహెచ్ఎస్ పై వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) బలోపేతం కోసం ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనం (Basic Pay/Pension) నుండి 1.5% చందా వసూలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై స్పష్టత లేకపోవడం వల్ల ఇప్పటివరకు రిటైర్డ్ అయిన 2,316 తో పాటు CPS ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని యూనియన్ (TSCPSEU) నేతలు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పెన్షనర్లకు మరియు CPS రిటైర్డ్ ఉద్యోగులకు ఉన్న సాంకేతిక వ్యత్యాసాన్ని ప్రభుత్వం గమనించాలని కోరారు. సీపీఎస్‌ ఉద్యోగికి రిటైర్ అయ్యాక ప్రభుత్వానికి సంబంధం ఉండదని, పెన్షనర్ ఐడీ ఉందని తెలిపారు. OPS పెన్షనర్లకు ప్రభుత్వం ట్రెజరీ (IFMIS) ద్వారా పెన్షన్ చెల్లిస్తుంది కాబట్టి, వారి పెన్షన్ నుండి 1.5% ఈహెచ్‌ఎస్ (EHS) చందా మినహాయించడం సాధ్యమవుతుందని అన్నారు. కానీ, 01.09.2004 తర్వాత చేరి రిటైర్ అయిన CPS ఉద్యోగులకు ప్రభుత్వం నుండి పెన్షన్ రాదని చెప్పారు. వీరి పెన్షన్ (Annuity) షేర్ మార్కెట్ విలువ (NAV) ఆధారంగా PFRDA నియమించిన ప్రైవేట్ ఏజెన్సీల (ASP) నుండి వస్తుందని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం తమ పెన్షన్ నుండి నేరుగా డబ్బులు కట్ చేయడం సాంకేతికంగా అసాధ్యమని పేర్కొన్నారు. అందుకే రిటైర్ అయిన సిపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉచిత ఆరోగ్య బీమా వర్తింప చేయాలని కోరారు. ట్రస్ట్ లో సీపీఎస్ యూనియన్ నుంచి సభ్యుడికి అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. పదవీ విరమణ చేసిన CPS ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు. ‘OPS ఉద్యోగుల మాదిరిగా కాకుండా, CPS పదవీ విరమణ చేసిన వారికి హామీ ఇవ్వబడిన చట్టబద్ధమైన పెన్షన్ లభించదు. ప్రభుత్వం నుండి ఎటువంటి సామాజిక భద్రతా రక్షణ ఉండదు. వారి వార్షికం మార్కెట్-లింక్డ్.. తరచుగా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల, వారి పరిమిత జీవనోపాధి నుండి ఆరోగ్య ప్రీమియం వసూలు చేయడం అన్యాయం’ అని చెప్పారు. ప్రాథమిక సామాజిక భద్రతా చర్యగా CPS పదవీ విరమణ చేసిన వారి ఆరోగ్య సంరక్షణ ఖర్చును రాష్ట్రం పూర్తిగా భరించాలని కోరారు.

రిటైర్డ్‌ సీపీఎస్‌ వారికి అరకొర పెన్షన్:

పదవీ విరమణ పొందిన తర్వాత, వృద్ధాప్యంలో ఆసుపత్రి ఖర్చుల కోసం CPS ఉద్యోగులు అప్పుల పాలవకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కావున, వెంటనే ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించి రిటైర్డ్ CPS ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కల్వ శ్రవణ్ కుమార్, కోటకొండ పవన్ కుమార్ పాల్గొన్నారు.

Latest News