mlc elections । కరీంనగర్ -మెదక్- నిజామాబాద్- అదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిరుమల్ రెడ్డి ఇన్నారెడ్డి ఖరారు

రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ రాబోయే రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవైపు సీపీఎస్ అధ్యాపకుడిని, మరోవైపు పాత పెన్షన్‌లో ఉన్న ఉపాధ్యాయుడిని అభ్యర్థులుగా పోటీలో నిలుపుతున్నట్టు చెప్పారు.

mlc elections । కరీంనగర్ -మెదక్- నిజామాబాద్- అదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిరుమల్ రెడ్డి ఇన్నారెడ్డి ఖరారు

mlc elections । వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఉమ్మడి కరీంనగర్-మెదక్-నిజామాబాద్-అదిలాబాద్ ఎన్నికల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో తిరుమల్‌ రెడ్డి ఎన్నారెడ్డిని అభ్యర్థిగా నిలపాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గం, 13 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఇటీవలే వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట కొలిపాక వెంకటస్వామి పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యవర్గ సమావేశంలో ఉపాధ్యాయులకి గత 28 సంవత్సరాలుగా సేవలు అందించిన సీనియర్ ఉపాధ్యాయుడు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డిని సీపీఎస్‌ యూనియన్ బలపరిచే అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపుతున్నట్లు కార్యవర్గ సమావేశం తీర్మానించింది.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ రాబోయే రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవైపు సీపీఎస్ అధ్యాపకుడిని, మరోవైపు పాత పెన్షన్‌లో ఉన్న ఉపాధ్యాయుడిని అభ్యర్థులుగా పోటీలో నిలుపుతున్నట్టు చెప్పారు. సీపీఎస్, ఓపీఎస్ అనే తేడా లేకుండా ఉపాధ్యాయ వర్గం నుండి ఈ పెట్టుబడిదారి పెన్షన్ విధానాన్ని పారదోలేందుకే సీపీఎస్ విధానంపై రెఫరెండంగా బరిలో ఉంటున్నామని తెలిపారు. సమాజానికి మార్గ నిర్దేశకులైన ఉపాధ్యాయులకు ఉన్న గొప్ప అవకాశం ఓటు హక్కు అని అన్నారు. ఈ ఓటు హక్కు తో సీపీఎస్ సంఘ అభ్యర్థులను గెలిపించి, ప్రభుత్వానికి ఇటు సీపీఎస్ అటు ఓపిఎస్ వారి నుండి రెఫరెండం గా రాష్ట్రంలో ని 2.5 లక్షల కుటుంబాలకు పాత పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మ్యాన పవన్ కుమార్ ,పోల శ్రీనివాస్,రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున్, రాజేష్ వనమాల,సిర్పూర్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.