సీపీఎస్ రద్దు చేయండి.. నూతన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు వినతి
సీపీ ఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ లు పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ను కోరారు.

సీపీ ఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ లు పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ను కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయనను కలిసి శాలువాతో సన్మానించారు. వినతిపత్రాన్ని అందచేశారు.
అనంతరం సిపిఎస్ రద్దు కొరకై ,ప్రభుత్వం ఏర్పాటు లో సీపీఎస్ ఉద్యోగుల మద్దతును గుర్తుచేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యుపిఎస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని రద్దుచేయడం వల్ల,రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలే ఆదాయాన్ని వివరించి , పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు ఆయనను కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మ్యాన పవన్, గడ్డం వెంకటేష్, బాలస్వామి, చంద్ర కాంత్, కృష్ణ రావు, భూమన్న, లక్ష్మీ నరసింహ స్వామి, తదితరులు పాల్గొన్నారు.