Abolish CPS । సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురండి
సీపీఎస్ ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చే యాలని కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

స్పీకర్ కు విజ్ఞప్తి చేసిన సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ
Abolish CPS । సీపీఎస్ ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చే యాలని కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ ,కోశాధికారి నరేష్ గౌడ్ మరియు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేంద్ర రావులు ఆదివారం హైదరాబాద్ లో శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ ను కలిసి 2004 సెప్టెంబర్ 1 నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అవుతున్న సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వినతి పత్రం సమర్పించారు. గత 20 సంవత్సరాలుగా సామాజిక భద్రత కరువై రిటైర్మెంట్ అయిన సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ల కుటుంబాలు ఎందరో రోడ్డున పడ్డారని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ స్పీకర్ కు వివరించారు. 2004లో ప్రవేశపెట్టిన ఈ విధానం కేవలం కార్పొరేట్లకు పెట్టుబడులు పెంచే పెన్షన్ విధానం అన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన ఏకీకృత పెన్షన్ విధానం వల్ల ఇప్పటివరకు ప్రజల సొమ్ము ప్రభుత్వ వాటా ,ఉద్యోగి వాటా కలిపి 20 శాతంగా షేర్ మార్కెట్లోకి వెళ్ళేది కానీ, ఈ ఏకీకృత పెన్షన్ విధానం వల్ల 28.5% షేర్ మార్కెట్లోకి పెట్టుబడులుగా వెళ్లడం జరుగుతుందన్నారు. దీంతో ఉద్యోగ ఉపాధ్యాయులకు సామాజిక భద్రత లేకుండా పోతుందని వాపోయారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాత పెన్షన్ అమలుకు హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ష్ విధానం అమలు చేస్తే రాష్ట్రంలోని రెండున్నర లక్షల ఉద్యోగ, ఉపాద్యాయ కుటుంబాలు ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని తెలిపారు. ఈ విషయంపై స్పంధంచిన స్పీకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కి ఈ సమస్య తీసుకెళ్తానని హామీ ఇచ్చారని యూనియన్ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో సీపీఎస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, సుశీల్ లు పాల్గొన్నారు.