Actress | ప్రేమలో మోసం… ఆరోగ్యంతో పోరాటం… అయినా ఆశలు వదలుకోని నటి మమతా మోహన్‌దాస్
Actress | మలయాళ చిత్రం మయూక్ తో సినీ కెరీర్‌ను ప్రారంభించిన మమతా మోహన్‌దాస్, తెలుగులో యమదొంగ ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించిన ఈ చిత్రం ఆమెకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం కల్పించింది. అనంతరం హోమం, కింగ్, కేడి వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
Actress | మలయాళ చిత్రం మయూక్ తో సినీ కెరీర్‌ను ప్రారంభించిన మమతా మోహన్‌దాస్, తెలుగులో యమదొంగ ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించిన ఈ చిత్రం ఆమెకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం కల్పించింది. అనంతరం హోమం, కింగ్, కేడి వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.అయితే కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆమె జీవితంలో అనుకోని సంఘటనలు చోటుచేసుకున్నాయి. రెండుసార్లు క్యాన్సర్ బారిన పడటం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎదురుదెబ్బలు తగిలినా, ధైర్యంగా పోరాడి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. ఆమె జీవన ప్రయాణం అనేక మందికి స్ఫూర్తిగా నిలిచింది.
ఇటీవల నటి సుహాసిని మణిరత్నం నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మమతా తన ప్రేమ, డేటింగ్ జీవితం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. “క్యాన్సర్ నిర్ధారణ తర్వాత ఒక మహిళగా నా జీవితంలో కొన్ని కోరికలు నెరవేర్చుకోవాలనుకున్నాను. ఆ సమయంలో మలయాళ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటుడు నన్ను డేటింగ్‌కు ఆహ్వానించాడు. మా కుటుంబ సభ్యుల అనుమతితో అతనితో బయటకు వెళ్లాను. కానీ అప్పటికే అతనికి మరొకరితో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని నాతో దాచిపెట్టాడు. దాదాపు నెల తర్వాత అతని సోదరుడి ద్వారా నిజం తెలిసి షాక్‌కు గురయ్యాను. ఆ మోసం నా మనసును తీవ్రంగా గాయపరిచింది” అంటూ ఆమె భావోద్వేగంగా చెప్పారు.
తన వివాహ జీవితం గురించీ ఆమె ఓపెన్‌గా మాట్లాడారు. మాజీ భర్త ప్రజీత్ పద్మనాభన్‌తో పరిచయం అతని సోదరి వివాహ వేడుకలో ఏర్పడిందని, అభిరుచులు కలవడంతో తొందరగా పెళ్లి చేసుకున్నామని తెలిపారు. అయితే పెళ్లైన ఆరు నెలలకే విడిపోవాల్సి వచ్చిందని, ఆ సమయంలో తాను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నానని పేర్కొన్నారు. అది జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయాల్లో ఒకటిగా మిగిలిపోయిందని ఆమె అన్నారు. ఇన్ని కష్టాలు ఎదురైనా జీవితంపై మమతా మోహన్‌దాస్ నమ్మకం కోల్పోలేదు. సరైన వ్యక్తి దొరికితే మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. “జీవితం చాలా అందమైనది. మనసులో నెగెటివ్ ఆలోచనలను దూరం చేసుకుని ముందుకు సాగాలి” అంటూ తోటి మహిళలకు ఆమె ఇచ్చిన సందేశం హృదయాన్ని తాకుతోంది. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ఆమె ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram