విధాత : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం కార్యక్రమాలతో బుధవారం బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు స్వస్తివాచన ఘట్టాన్ని ప్రారంభించారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం కొనసాగనున్న బ్రహ్మోత్సవ పర్వంలోని తొలి పూజల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఆనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవాని శంకర్, డీఈవో భాస్కర్ శర్మ, ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ఈ నెల 28 వ తేదీ వరకు జరుగనున్నాయి. 24న స్వామివారి ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం, 26న దివ్యవిమాన రథోత్సవం, 28న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు. ఉత్సవాల సందర్భంగా నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చనలను అధికారు రద్దు చేశారు.
బ్రహ్మోత్సవాల షెడ్యూల్ :
ఫిబ్రవరి 18 న స్వస్తి వాచనం, విష్వక్సేన ఆరాధన, సాయంత్రం మత్స్యగ్రహణం, అంకురార్పణ
ఫిబ్రవరి 19న ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం భేరి పూజ.
ఫిబ్రవరి 20 న ఉదయం మత్సావతార అలంకారం, సాయంత్రం శేష వాహన సేవ వేదపారాయణములు. రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ
ఫిబ్రవరి21 న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ
ఫిబ్రవరి22 న శ్రీ కృష్ణాలంకార సేవ, రాత్రి పొన్న వాహన సేవ.
ఫిబ్రవరి23 న ఉదయం గోవర్ధన గిరి ధారి, సాయంత్రం సింహ వాహన సేవ
ఫిబ్రవరి 24 న జగన్మోహినీ అలంకార సేవ, అశ్వ వాహనం పై రాత్రి ఎదుర్కోలు వేడుక
ఫిబ్రవరి 25 న రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం
ఫిబ్రవరి 26న రాత్రి 8 గంటలకు దివ్వవిమాన రథోత్సవం
ఫిబ్రవరి27 న స్వామి వారి చక్రతీర్థ స్నానం.
ఫిబ్రవరి 28 న గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.
ఇవి కూడా చదవండి :
Chandrayaan-4 | చంద్రయాన్-4కి పర్ఫెక్ట్ అడ్రస్ పట్టేసిన ఇస్రో… చంద్రుడిపై స్థిర నివాసానికి ఇది పునాది?
Ambati Rambabu : అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల
