యాదగిరి గుట్టలో భక్తుల ఫుల్‌ రష్‌

యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వరుస సెలవులు కావడంతో క్యూలైన్లు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి.

యాదగిరి గుట్టలో భక్తుల ఫుల్‌ రష్‌

విధాత, హైదరాబాద్ : యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వరుస సెలవులు కావడంతో క్యూలైన్లు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి.

ఆలయ మాడవీధులు, కల్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దర్శనం కోసం కనీసం నాలుగు గంటల సమయం పడుతుంది.

అలాగే ఈ నెల 12వ తేదీ మంగళవారం రోజున యాదగిరిగుట్ట క్షేత్ర పాలకుడైన శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. శ్రీ ఆంజనేయస్వామి వారికి 108 కలశాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన (ఆకుపుజ), అష్టోత్తరం, సింధూరార్చన,శ్రీస్వామి వారికి పల్లకి సేవ, మహానివేదన, తీర్ధప్రసాద గోష్ఠి నిర్వహించనున్నారు.