ప్రముఖ న్యాయవాది ఆర్ఎస్ఎస్ ప్రముఖులు గొట్టిపాటి మృతి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం

విధాత:ప్రముఖ న్యాయవాది, ఆర్ఎస్ఎస్ పూర్వాంధ్ర తొలి కార్యవాహ్ గొట్టిపాటి మురళీమోహన్ (82) మంగళవారం సాయంత్రం పరమపదించారు. 1977 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన జనతా పార్టీ తరపున పోటీ చేశారు. వీరికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె గత నెలలో గుండెపోటుతో మరణించారు. మిగిలిన ముగ్గురు కుమార్తెలు విదేశాల్లో ఉన్నారు. ఏకైక కుమారుడు వీరి వద్దనే ఉంటున్నారు. ఆజన్మాంతం సంఘ కార్య విస్తరణ లోనే తన సంపూర్ణ శక్తిని వెచ్చించిన ఆదర్శప్రాయుడు శ్రీ మురళీ మోహన్. […]

  • Publish Date - June 9, 2021 / 03:30 AM IST

విధాత:ప్రముఖ న్యాయవాది, ఆర్ఎస్ఎస్ పూర్వాంధ్ర తొలి కార్యవాహ్ గొట్టిపాటి మురళీమోహన్ (82) మంగళవారం సాయంత్రం పరమపదించారు. 1977 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన జనతా పార్టీ తరపున పోటీ చేశారు. వీరికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె గత నెలలో గుండెపోటుతో మరణించారు. మిగిలిన ముగ్గురు కుమార్తెలు విదేశాల్లో ఉన్నారు. ఏకైక కుమారుడు వీరి వద్దనే ఉంటున్నారు. ఆజన్మాంతం సంఘ కార్య విస్తరణ లోనే తన సంపూర్ణ శక్తిని వెచ్చించిన ఆదర్శప్రాయుడు శ్రీ మురళీ మోహన్.

ఉపరాష్ట్రపతి విచారం
ప్రముఖ న్యాయవాది ఆర్ ఎస్ ఎస్ ప్రముఖుడు గొట్టిపాటి మురళీమోహన్ మరణం పట్ల భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఓ ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన తనకు ఎంతో సన్నిహితుడని ప్రధానంగా చాలా సౌమ్యులు…. స్నేహశీలి అని అన్నారు. న్యాయవాద వృత్తి పట్ల వారికి గల నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణ తో కూడిన జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు.ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జైలుకు వెళ్లారని అన్నారు. యువతలో ఈ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తు చేస్తూ నిరంతరం వారిలో స్ఫూర్తి నింపే వారని అన్నారు.మురళీ మోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నాయుడు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు.