TICKETLU MEME KONALI SONG
విధాత: 30 రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప 2 సినిమా బెన్‌ఫిట్ షో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మరోసారి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ సారి కేసులు, అరెస్టుల విషయంలో కాదు.. ఆ ఘటనపై సెటైరికల్ రూపొందించిన జానపద (ఫోక్) పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
తొక్కిసలాట ఘటనే కాకుండా బయట సినిమా నటుల ప్రవర్తన, లోపల వారి అటిట్యూడ్.. ప్రేక్షకులు.. అభిమానుల కష్టాలు.. బౌన్సర్లు దాడులు.. హీరోల వైఖరులను పాటకు సాహిత్యంగా మలుచుకుని వ్యంగ్యాస్థ్రాలతో రూపొందించిన సైటైరికల్ సాంగ్ ఆలోచనాత్మకంగా ఉంది. టికెట్లు మేమే కొనాలి.. చప్పట్లు మేమే కొట్టాలి.. చావులు మేమే చావాలి.. సంపాదన మేమే కావాలంటూ (TICKETLU MEME KONALI SONG) పాటలో ప్రస్తుత పరిణామాలపై సంధించిన వంగ్యాస్త్రాలు అద్భుతంగా ఉన్నాయి. చెలుకల శ్రీనివాస్ లిరిక్స్, కథ అందించిన ఈ పాటను నటి రవళిపై చిత్రీకరించగా ఫోక్ సింగర్ ప్రభ ఆలపించింది.
ఈపాటను చాలా మంది వైరల్ చేస్తుండగా మరి కొంతమంది మిమ్మల్ని సినిమా ఎవరు చూడమన్నారు, మీ ఇంటికి వచ్చి సినిమా చూడాల్సిందే అని అడిగారా, మిమ్మల్ని వాళ్లేమైనా బలవంతం చేశారా.. మీకు ఇష్టమై చూసి ఇప్పుడు వారిని అనడం ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉండగా ఈ పాట బాగా వైరల్ కావడం, ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం, రిపోర్ట్స్ ఎక్కువకావడంతో వీడియో కాస్త ఏజ్ రిస్ట్రిక్టెడ్ కింద చేరిపోయింది. దీంతో పబ్లిక్‌కు యూట్యూబ్‌లో ఈ వీడియో గురించి సెర్చ్ చేసినా దొరకడం కష్టం అయింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఈ క్రింద ఇచ్చిన లింక్‌ను గూగుల్ సెర్చ్ లో పేస్ట్ చేసి మీ వయస్సును నిర్థారించి తర్వాత చూసేయండి
https://www.youtube.com/watch?v=B-ACglgEugM