Tamannaah Bhatia |
విధాత: సోషల్ మీడియా నిండా ఈమధ్య కాస్త ఫేమ్‌లో ఉన్న హీరో, హీరోయిన్లను ట్రోల్ కావడం పరిపాటై పోయింది. నటి తమన్నా విషయంలోనూ ఈ ట్రోలింగ్స్ కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ‘లస్ట్ స్టోరీస్ 2’లో ఆమె చేసిన బెడ్ రూం సీన్స్ అయితే మరీ ఘోరంగా ఉన్నాయని.. ఈమధ్య గ్లామర్, ఎక్స్‌ఫోజింగ్ డోస్ బాగా పెంచేసిందని, నెట్టింట కడిగిపారేస్తున్నారు నెటిజన్లు.
నెటిజన్ల చేతిలో కాస్త గట్టిగానే ట్రోలింగ్‌కి గురవుతున్న తమన్నా.. తన మీద వస్తున్న విమర్శలకు స్పందించింది. చాలా చిన్న వయసులోనే తమ అభిప్రాయాలను తనపై రుద్దాలని చూస్తే దానిని వ్యతిరేకించిందట. 14 ఏళ్ళ వయసులోనే పరిశ్రమలోకి అడుగు పెట్టిన తనకు, ఈ పద్దేనిమిదేళ్ళ కెరీర్‌లో ఎన్నో విమర్శలు చూశానని, నటిగా తొలి అడుగు వేసే క్రమంలోనే చాలా విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.
నటిగా చేసే సమయంలోనూ.. ‘ఆడపిల్లను ఎందుకు సినీ రంగంలోకి పంపుతున్నారని, పరిశ్రమ గురించి మీకు సరిగా తెలియదా?’ అని ఎంతోమంది మా అమ్మానాన్నలకు సలహాలు ఇచ్చారని తమన్నా వెల్లడించింది. ఇదంతా పట్టించుకుని ఉంటే అసలు సినిమాలోనే ఉండేదాన్ని కాదని చెప్పుకొచ్చింది. జనాలు ఎంత విమర్శించినా పట్టించుకోనని తెగేసి చెప్పింది ఈ అమ్మడు.
ఇక ఇప్పుడు తనపై వస్తున్న కామెంట్స్ విషయానికి వస్తే.. ఎవరో సృష్టించిన రూమర్స్‌ని, వార్తలుగా బాగా అల్లి మరీ ప్రచారం చేస్తున్నారని మండిపడింది తమన్నా. ఇదే విషయం నన్ను బాధిస్తుంది. నా పనిలో ఏదైనా విమర్శ ఉంటే తీసుకుని, సరిదిద్దుకుంటాను గానీ ఇలా లేనిపోని వాటికి రాద్దాంతం చేస్తే పట్టించు కోనని తనపై వస్తున్న విమర్శలపై తమన్నా ఫైరయింది. కాలం ఇంతగా అభివృద్ధి చెందినా.. ఇంకా నేను సినిమా పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి మాటలే వినాల్సి వస్తుందన్నందుకు బాధగా ఉంది. ఇంక మారరా.. అని తమన్నా తనదైన తరహాలో కౌంటర్ వేసింది.
ఇక తన ప్రేమ గురించి చెబుతూ.. ఒకరిపై ప్రేమ పుట్టాలంటే దానికి సమయంతో పనిలేదు. ఇదే మా విషయంలోనూ జరిగింది. ఇద్దరం దగ్గరవడానికి చాలా విషయాలు సహకరించాయని తెలిపింది. విజయ్‌లో మంచి నటుడు ఉన్నాడని, అతని వర్క్, అతని నటనకు నేను అభిమానినని పేర్కొంది. అతను అంత త్వరగా ఎవరినీ జడ్జ్ చేయడు. దయ, సహనం చాలా ఎక్కువ. అతనిలోని ఆ స్వభావం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.
మమ్మల్ని దగ్గర చేసిన వాటిలో ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయని మిల్కీ బ్యూటీ తన ప్రేమ వ్యవహారంపై పూసగుచ్చినట్లుగా పేర్కొంది. మొత్తంగా అయితే.. ఈ కాలం తారలకు ఆమాత్రం విమర్శలు ఎదురుకావడం, వాటిని తట్టుకుని, ఎదిరించి నిలబడగలిగే ఆత్మస్థైర్యం ఉండటం రెండూ ముఖ్యమే.. ఏమంటారు?