Almas Khan | చీప్ ప్రాపగాండా అనేది విఫలమైన బీఆర్ఎస్ నాయకుల చివరి ఆయుధం మాత్రమేనని తెలంగాణ యువ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్మాస్ ఖాన్ విమర్శించారు. ఇటీవల ఫహీమ్ ఖురేషీపై జరుగుతున్న దుష్ప్రచారం అంతా బీఆర్ఎస్ నాయకుల భయంతో, ఈర్ష్యతో చేస్తున్న పని అని అన్నారు. ఫహీమ్ ఖురేషీ రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న తీరు వాళ్లకు జీర్ణించలేకపోతున్నారని మండిపడ్డారు. ఫహీమ్ ఖురేషీ నిజాయితీగల నాయకుడు, అల్లాకే ఆయన భయపడుతారని చెప్పారు.
రాహుల్ గాంధీ, మీనాక్షి నాటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో నడుస్తూ..ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలు, సూత్రాలను కాపాడుతూ ముందుకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. గౌరవం, అవమానం అనే విషయాలు రాజకీయ ప్రత్యర్థుల చేతుల్లో లేవని అవన్నీ అల్లాహ్ చేతుల్లోనే ఉంటాయన్నారు. ఖురాన్‌లో చెప్పినట్లు “అల్లాహ్ ఎవరిని కావాలంటే వారిని గౌరవిస్తాడు, ఎవరిని కావాలంటే వారిని అవమానపరుస్తాడు” అని వెల్లడించారు. ఫహీమ్ ఖురేషీపై జరుగుతున్న ఈ కుతంత్ర దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్ వెన్నంటే ఉంటారని, నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవతో నిండిన నాయకులతోనే ప్రజలు నిలబడతారని అల్మాస్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు.