Site icon vidhaatha

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసు.. 25కు వాయిదా!

విధాత: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది. ప్రధాన నిందితుడు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు న్యాయవాది నిరంజన్ రెడ్డి తన క్లయింట్ కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వాదించాడు. ముందస్తు బెయిల్ ఇస్తే వారంలోపు ప్రభాకర్ రావు విచారణకు వస్తారని వాదనలు వినిపించారు. ఇటు ప్రభుత్వ తరుపు న్యాయవాది లూథ్రా తన వాదనలు వినిపించారు.

ప్రభాకర్ రావు పాస్ పోర్టు రద్ధయితే విచారణకు అమెరికా నుంచి ఎలా వస్తాని ప్రశ్నించారు. వాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. ఇప్పటికే ఈ కేసులో మరో నిందితుడు శ్రవణ్ రావు విచారణకు హాజరవుతున్నారు. మిగిలిన నిందితులు డీఎస్పీ ప్రణీత్ రావు, ఏసీపీ భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను ఇప్పటికే విచారించారు.

Exit mobile version