Site icon vidhaatha

Vi కీలక మైలురాయి.. నెట్టీస్‌ అవతార్‌తో సరికొత్త ప్రచారం!

ముంబయి: భారతదేశ ప్రముఖ టెలికాం సంస్థ Vi (వొడాఫోన్ ఐడియా), 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా లక్షకు పైగా కొత్త టవర్లను ఏర్పాటు చేసిన అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఈ ఘనతను ప్రజలకు తెలియజేసేందుకు Vi ఒక సరికొత్త ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. తమ నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను వేగంగా, విస్తృతంగా పటిష్టం చేయడంలో Viకున్న నిబద్ధతకు ఇది నిదర్శనం.

నెట్వర్క్ విస్తరణకు నెట్టీస్ అవతార్

Vi తన నెట్‌వర్క్ పటిష్టతను ఆకట్టుకునే విధంగా తెలియజేసేందుకు ‘ది నెట్టీస్’ (The Netties) పేరుతో సరికొత్త నెట్‌వర్క్ అవతార్‌లను రూపొందించింది. మొబైల్ టవర్ల స్ఫూర్తితో రూపొందిన ఈ యానిమేటెడ్ క్యారెక్టర్లు, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సందడి నేపథ్యంలో అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన బలమైన బృందాన్ని ప్రతిబింబిస్తాయి. సరదాగా, స్ఫూర్తినిచ్చే ఈ నెట్టీస్ జట్టు, Vi నెట్‌వర్క్ స్థాయి, పటిష్టతను ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా చాటిచెబుతుంది.

గణనీయమైన ప్రగతి, విస్తరించిన సేవలు

ఇటీవలి కాలంలో నెట్‌వర్క్ విస్తరణలో Vi గణనీయమైన పురోగతి సాధించింది. ముంబై, చండీగఢ్, పాట్నాలో 5జీ సేవలను ప్రారంభించి, త్వరలో ఢిల్లీ, బెంగళూరులో కూడా ప్రారంభించనుంది. Vi తన 4జీ నెట్‌వర్క్‌ను కూడా పటిష్టం చేసుకుంది. 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz స్పెక్ట్రం బ్యాండ్‌ల వ్యాప్తంగా కొత్త టవర్లు ఏర్పాటు చేస్తూ, నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ సామర్థ్యాలతో పాటు కవరేజీని కూడా విస్తరించింది. ఇండోర్, ఔట్‌డోర్ కవరేజీ పటిష్టమవడం, డేటా వేగం మెరుగుపడటం, సేవల పరిధి విస్తరించడం వంటి అంశాలకు ఇవన్నీ దోహదపడ్డాయి. ఇది 107 కోట్ల మంది ప్రజలకు అందుతున్న 4జీ అనుభూతిని మెరుగుపర్చింది.

నాణ్యమైన కనెక్టివిటీ..

Vi చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా మాట్లాడుతూ, “నెట్‌వర్క్‌ను పెంచుకునే వ్యూహం కేవలం కార్యకలాపాలను విస్తరించడం కాదు, స్మార్ట్‌గా, వ్యూహాత్మకంగా వినియోగించుకోవడంగా లక్ష్యంగా పెట్టుకున్నాము. అత్యధిక ట్రాఫిక్ ప్రాంతాలకు ప్రాధాన్యతనివ్వడం, స్పెక్ట్రంను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, నాణ్యమైన ఇండోర్ అనుభూతిని అందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టి, భవిష్యత్తులోనూ పటిష్టంగా నిలబడే, అత్యుత్తమ పనితీరు కనబరిచే నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నాము. ఆరు నెలల్లోనే అదనంగా లక్ష టవర్లను ఏర్పాటు చేయడం, అత్యుత్తమ 4జీ అనుభూతిని అందించడంలో గుర్తింపు పొందడం, మా కస్టమర్‌లకు దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కలిగేలా, నిలకడగా, నాణ్యమైన కనెక్టివిటీని అందించడంలో Viకు గల నిబద్ధతకు నిదర్శనం” అని పేర్కొన్నారు.

ఓగిల్వి సీనియర్ ECD రోహిత్ దూబే ఈ ప్రచారం గురించి మాట్లాడుతూ.. Vi కోసం ఈ క్యాంపెయిన్‌ను రూపొందిస్తున్నప్పుడు ప్రతి అంశం ఉల్లాసభరితంగా ఉండాలని భావించాం. అందుకే సాంకేతికాంశాలను మనస్సుతో ముడివేసి చెప్పేందుకు యానిమేషన్‌ను ఎంచుకున్నాం. ఈ చిత్రంలో టెలికాం టవర్లు జట్టు సభ్యుల్లాగా మారతాయి. గొప్ప క్రికెట్ టీమ్ ఒక బంతిని కూడా చేజారనివ్వనట్టే, మా పటిష్టమైన నెట్‌వర్క్ కూడా ఒక సిగ్నల్‌ను కూడా డ్రాప్ కానివ్వదనే విషయాన్ని ఇది చాటిచెబుతుంది. ఒక లక్ష పైగా కొత్త టవర్లు, దృఢమైన టీమ్ – ఇది మా పటిష్టతను తెలియజేస్తుంది” అని వివరించారు. ఓగిల్వి ఇండియా రూపొందించిన ఈ 360-డిగ్రీ క్యాంపెయిన్‌లో రెండు టీవీ ప్రకటనలు ఉన్నాయి. మే 17 నుండి టీవీ, ఓటీటీ, రేడియో, సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఇవి ప్రసారం అవుతాయి.

Exit mobile version