పార్టీతో అభిప్రాయ భేదాలు
అంగీకరించిన శశి థరూర్
పార్టీలోపలే చర్చిస్తానని వెల్లడి
తిరువనంతపురం : పార్టీతో తనకు కొన్ని అభిప్రాయ భేదాలున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ చెప్పారు. పార్టీ నుంచి తనను ఎవరైనా సంప్రదిస్తే వాటిపై ఆంతరంగికంగానే చర్చిస్తానని స్పష్టం చేశారు. ‘పదహారేళ్లుగా నేను పార్టీలో పనిచేస్తున్నా.. కొన్ని అభిప్రాయ భేదాలున్నాయి. వాటిని పార్టీలోపలే చర్చిస్తాను. బయట మాట్లాడను’ అని అన్నారు. పార్టీలో చర్చించడానికి సమయం రావాలన్నారు. ఆపరేషన్ సిందూర్ సహా పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా థరూర్ మాట్లాడటం కొంత కలకలం రేపింది. కొందరు కాంగ్రెస్ నాయకులు సైతం బాహాటంగానే ఆయన వైఖరిని తప్పపట్టారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌తో విభేదాలు ఉన్నాయా అని విలేకరులు శశిథరూర్‌ని ప్రశ్నించారు. ఇక్కడ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటింగ్ కొనసాగుతున్నందున ఇప్పుడు దాని గురించి మాట్లాడటం ఇష్టం లేదని థరూర్ బదులిచ్చారు. ‘పోలింగ్ కొనసాగుతున్నందున ఆ సమస్యల గురించి (నాయకత్వంతో ఆయనకున్న విభేదాలు) మాట్లాడటానికి ఇది సమయం కాదు, అక్కడ నా స్నేహితుడు (కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యదాన్ షౌకత్) గెలవాలని కోరుకుంటున్నాను.’ అని శశిథరూర్ స్పష్టం చేశారు.
పార్టీతో అభిప్రాయ భేదాలు అంగీకరించిన శశి థరూర్
పార్టీతో తనకు కొన్ని అభిప్రాయ భేదాలున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ చెప్పారు. పార్టీ నుంచి తనను ఎవరైనా సంప్రదిస్తే వాటిపై ఆంతరంగికంగానే చర్చిస్తానని స్పష్టం చేశారు

Latest News
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*
పోతునూరు రైతుల “వరి” గోస