Maharaja
ఈఏడాది జూన్‌లో లాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం విజయ్ సేతుపతి నటించిన మహారాజా (Maharaja). విడుదలైన ప్రతి చోటా పాజిటివ్ టాక్ తెచ్చుకుని జన నీరాజనాలు అందుకున్న ఈ థ్రిల్లర్ చిత్రం రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఈ యేడు తమిళ్ ఫస్ట్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచి రికార్డు సృష్టించింది.
అయితే ఇప్పుడు ఈ మూవీ తాజాగా మరో అరుదైన ఫీట్‌ను సాధించి చరిత్ర నెలకొల్పింది. పది రోజుల క్రితం నవంబర్ 29న చైనా వ్యాప్తంగా 40 వేలకు పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా అక్కడా కూడా అదిరిపోయే ఆదరణను దక్కించుకుంటూ రూ.100కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇంకా హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో పరుగులు పెడుతుంది.
చైనాలో విడుదలైన పది రోజుల్లోనే రూ.66 కోట్లు రాబట్టింది. దీంతో మహరాజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లను అధిగమించి రూ.250 కోట్ల మార్క్‌ను టచ్ చేయనుంది. దంగల్, బాహుబలి, RRR వంటి సినిమాల తర్వాత చైనాలో ఎక్కువ ప్రజాధరణ, రెవెన్యూ దక్కించుకున్న చిత్రంగా మహారాజా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది.