Weight loss trend | ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వెయిట్ గెయిన్ ఎన్నో అనర్థాలకు కారణమవుతోంది. ఊబకాయం వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అందుకే బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్‌ల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేదు. ఈ క్రమంలో చైనా (China)లో బరువు తగ్గే విషయంలో ఓ కొత్త ట్రెండ్ (Weight loss trend) నడుస్తోంది.
చైనీయులు ఆహారంగా ప్లాస్టిక్ కవర్లను నములుతున్నారు. ఏదైనా తినడానికి ముందు (before eating food) కవర్‌ని నోట్లో పెట్టుకుంటారు (wrapping mouth with plastic). తినాలనుకున్న ఆహారాన్ని అందులో ఉంచి బాగా నములుతారు. ఆ తర్వాత దాన్ని బయటకు ఉమ్మేస్తారు. ఇలా చేయడం వల్ల మనకు నచ్చిన ఆహారాన్ని కడుపు నిండా తిన్న అనుభూతి మెదడుకు కలుగుతుందంట. అంతేకాదు, ఆకలి కూడా వేయదట. బరువును నియంత్రించడంలో ఈ విధానం సాయపడుతోందని చైనీయులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ వింత ట్రెండ్ చైనా మొత్తం వైరల్ అవుతోంది. చాలా మంది చైనీయులు ఈ పద్ధతిని అనుసరిస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆ వీడియోలను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌లో ఉండే రసాయనాలు నోట్లోకి వెళ్లిపోయి జీర్ణ వ్యవస్థకు హాని కలిగించొచ్చని చెబుతున్నారు.
“ప్లాస్టిక్‌ను మానవ శరీరం జీర్ణించుకోదు. ఒక వ్యక్తి ప్లాస్టిక్‌ను తీసుకుంటే.. అది కడుపు, పేగుల్లో ఇన్ఫెక్షన్‌కు కూడా దారితీయొచ్చు. ఇది శరీరంలో విషపూరిత రసాయనాలను కూడా విడుదల చేస్తుంది. కాలేయం, మెదడు, హార్మోన్‌లను ప్రభావితం చేస్తుంది” అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన పద్ధతులను ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Allu Arjun | ప్రీ వెడ్డింగ్ పార్టీలో బన్నీ లుక్ వైరల్ .. గ్లాస్–సిగార్ పిక్‌పై నెట్టింట చర్చ
Walking | వాకింగ్ చేసేందుకు టైమ్ లేదా..? అయితే ఈ చిన్న చిట్కాలు పాటించండి..
