Walking | వాకింగ్ చేసేందుకు టైమ్ లేదా..? అయితే ఈ చిన్న చిట్కాలు పాటించండి..

నడక (Walking) ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం అందరికీ తెలుసు. నడకతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడడం, బరువు తగ్గడం, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. అయితే, చాలా మందికి వాకింగ్ చేసేందుకు టైమ్ ఉండ‌దు (Dont have time to walk every day). అలాంటి వాళ్లు ఈ చిన్న చిట్కాలు (Walking Tips) పాటిస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

Walking | వాకింగ్ చేసేందుకు టైమ్ లేదా..? అయితే ఈ చిన్న చిట్కాలు పాటించండి..

Walking | నడక (Walking) ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విష‌యం అంద‌రికీ తెలుసు. నడకతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజుకు 30 నిమిషాల చురుకైన నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. బరువు తగ్గడం, రక్తపోటును నియంత్రించడం, ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఇది కీళ్లను బలోపేతం చేసి, మధుమేహం, క్యాన్సర్, స్ట్రోక్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే రోజులో క‌నీసం అర‌గంట సేపైనా వాకింగ్ చేయాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

రోజుకు 7 వేల నుంచి 10 వేల అడుగులు వేయాలి. ఉన్న‌చోటే కూర్చోకూడ‌దు. అప్పుడ‌ప్పుడు లేచి అటూఇటూ తిరుగుతూ ఉండాలి. కానీ ప్ర‌స్తుతం ఉరుకులు ప‌రుగుల జీవితంలో చాలా మందికి వ్యాయామం చేసే టైమ్ దొర‌క‌డం లేదు. ముఖ్యంగా ఆడ‌వాళ్ల‌కు. వారికి ఇంటిప‌ని, పిల్ల‌లు, వంట‌ప‌ని, ఆఫీస్ ప‌ని అంటూ రోజు మొత్తం ఏదో ఒక‌ప‌నితోనే స‌రిపోతుంది. పైగా ట్రాఫిక్‌లోనే స‌గంజీవితం పోతోంది. వాకింగ్‌కు వెళ్లే టైమ్ దొర‌క‌దు. స‌మ‌యం దొరికినా ప‌ని చేసి అల‌సిపోవ‌డంతో కాస్త విశ్రాంతి తీసుకోవాల‌ని అనిపిస్తుంటుంది. అలా వాకింగ్‌కు టైమ్ లేని వాళ్లు కొన్ని(Dont have time to walk every day) చిట్కాల‌తోనే గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వాకింగ్ చేసేందుకు సమయం లేకపోతే.. మ‌నం చేసే రోజువారీ పనుల్లోనే చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. లిఫ్ట్‌, ఎస్క‌లేట‌ర్ల‌కు బదులుగా మెట్లు వాడాలి. దీనివల్ల కండరాలు ఎక్కువగా పనిచేస్తాయి. ఫలితంగా, ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. నడక కంటే మెట్లు ఎక్కడం వల్లే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక ఫోన్ మాట్లాడేట‌ప్పుడు కూడా ఒకే చోటే స్థిరంగా ఉండ‌కుండా అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడితే మంచిది.

ఆఫీస్‌, షాపింగ్స్‌కు వెళ్లిన‌ప్పుడు బైక్‌, కార్‌ను కాస్త దూరంగా పార్క్‌ చేయండి. దీని వ‌ల్ల కాస్త న‌డిచే అవ‌కాశం ఉంటుంది. ఇంటికి స‌మీపంలోని షాప్‌కు వెళ్లిన‌ప్పుడు, కూర‌గాయ‌లు వంటివాటి కోసం వెళ్లిన‌ప్పుడు వాహ‌నం వాడ‌కూడ‌దు. అలా స‌ర‌దాగా న‌డుస్తూ వెళ్లి వ‌స్తే మంచిది. అంతేకాదు, ఆఫీస్‌లో కుర్చీకి అతుక్కుపోకుండా.. ప్రతి గంటకు ఒకసారి సీటు నుండి లేచి కాసేపు నడవడం అల‌వాటు చేసుకోండి. ఇలా చేయ‌డం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ప్ర‌తీ ప‌నికీ ఆఫీస్ బాయ్‌పైనే ఆధార‌ప‌డ‌కండి. వాట‌ర్ తెచ్చుకోవ‌డం, ప్రింట్స్ తీసుకోవ‌డం వంటికి స్వ‌యంగా మీరే చేసుకోవాలి. ఇక గ్రాస‌రీస్‌ను మోయ‌డం, పిల్ల‌ల‌తో ఆడుకోవ‌డం, కూర్చున్న‌ప్పుడు పాదాల‌ను అటూఇటూ క‌ద‌ప‌డం వంటివి చేయాలి. ఇలా చేస్తే మ‌నం ఆరోగ్యంగా జీవించ‌గ‌లం. ప్ర‌త్యేకంగా వాకింగ్‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు.

ఇవి కూడా చదవండి :

Madam Zeher | ప‌గ‌లు బ్యూటీపార్ల‌ర్‌ను న‌డుపుతూ.. రాత్రి డ్ర‌గ్స్ సిండికేట్‌ను శాసిస్తోంది
Delhi | ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. ఎర్ర‌కోట వ‌ద్ద హైఅల‌ర్ట్