Delhi | ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. ఎర్రకోట వద్ద హైఅలర్ట్
Delhi | దేశ రాజధాని ఢిల్లీ నగరానికి ఉగ్ర ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు చాందినీ చౌక్ వద్ద లష్కరే తోయిబా ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
Delhi | దేశ రాజధాని ఢిల్లీ నగరానికి ఉగ్ర ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు చాందినీ చౌక్ వద్ద లష్కరే తోయిబా ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఇందుకు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను వినియోగించే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. బాంబు స్క్వాడ్‌లు రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తక్షణమే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోగా, 160 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని లష్కరే తోయిబా ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేశాయి.
గతేడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఉగ్రవాదులు కారు బాంబు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. దాదాపు 24 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ వద్ద పేలుడు పదార్థాలతో కూడిన కారు పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి 12 మంది మరణించగా, పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడికి పాల్పడింది.. ఫరీదాబాద్‌కు చెందిన ఉమర్ మహ్మద్ అలియాస్ ఉమర్ ఉన్ నబీ అని డీఎన్ఏ రిపోర్టులో వెల్లడైంది. ఈ కారు బాంబు దాడిలో 2900 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించినట్లు విచారణలో తేలింది. ఇందులో ప్రధానంగా అమ్మోనియం నైట్రేట్‌ను వినియోగించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram