Site icon vidhaatha

Veera Dheera Soora: విక్ర‌మ్‌, ఎస్జే సూర్య‌ అద‌ర‌గొట్టారుగా

Veera Dheera Soora:

విధాత‌, సినిమా: తంగ‌లాన్ వంటి మంచి విజ‌యం త‌ర్వాత చియాన్‌ విక్ర‌మ్ (Chiyaan Vikram) న‌టిస్తోన్న నూత‌న‌ చిత్రం వీర ధీర శూర (Veera Dheera Soora) పార్ట్‌2. మార్చి27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రాయ‌న్‌, వేట్ట‌యాన్ సినిమాల‌తో మంచి పేరు తెచ్చుకున్న దుషారా విజ‌య‌న్ (Dushara Vijayan) క‌థానాయిక‌గా చేస్తోంది. ఎస్జే సూర్య (SJ Suryah), మ‌ల‌యాళ పాపుల‌ర్ యాక్ట‌ర్ సూరజ్ వెంజరమూడు (Suraj Venjaramoodu), సిద్ధిక్, తెలుగు నుంచి థ‌ర్టీ ఇయ‌ర్స్ ర‌ఘు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

గ‌త సంవ‌త్స‌రం సిద్ధార్థ్‌తో చిత్తా (చిన్నా) అనే డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌ సినిమాను తెర‌కెక్కించిన SU అరుణ్ కుమార్ (S.U.Arun Kumar) ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా జీవీ ప్ర‌కాశ్ (G.V.Prakash) సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా ఫ‌స్ట్ పార్ట్ 1 షూటింగ్ చేయ‌కుండానే పార్ట్‌2 చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్ధం చేయ‌డం విశేషం. ఈ మూవీ విడుద‌ల అనంత‌రం ఫ్రీక్వెల్‌గా మొద‌టి భాగాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి గ‌తంలో రిలీజ్ చేసిన టీజ‌ర్‌ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా సినిమాలోని ప్ర‌ధాన‌పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేస్తూ మ‌రో టీజ‌ర్ రిలీజ్ చేశారు. టీజ‌ర్‌ను చూస్తే సినిమాలో విక్ర‌మ్ కిరాణ షాపు న‌డిపేవాడిగా మ‌రోవైపు నేర ప్ర‌పంచంతో సంబంధాలు, పోలీసుల‌తో పోరాడే వ్య‌క్తిగా క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోండ‌గా, పోలీస్ ఆఫీస‌ర్‌గా ఎస్జే సూర్య మ‌రో యాంగ్రీ రోల్‌లో ప్రేక్ష‌కుల‌ను స్ట‌న్ చేయ‌నున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

 

Exit mobile version