ప్రపంచంలోనే అతిపెద్ద కొండచిలువ.. ఇంట్లో హల్‌ చల్‌

విధాత: సామాజిక మాధ్యమాల్లో వచ్చే అంశాల్లో కొన్ని కొన్ని ఒళ్లు జలదరించేలా ఉంటాయి. పాముల సంగతైతే చెప్పనే అవసరం లేదు. అందులోనూ కొండచిలువ అంటే సరేసరి. కానీ.. ఈసారి దర్శనమిచ్చినది ఆషామాషీ కొండచిలువ కాదు. ప్రపంచంలోనే అత్యంత భారీ, పొడవైన కొండచిలువగా అభివర్ణిస్తున్నారు. ఒక గోడ మీదుగా ఇంటి వరండాలోకి పాకుతున్న భారీ కొండచిలువను ఔత్సాహికులెవరో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కొంతమంది స్నేక్‌ క్యాచర్స్‌ దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన పాములను ఒడుపుగా పట్టుకుని.. తిరిగి […]

  • Publish Date - March 31, 2023 / 06:06 PM IST

విధాత: సామాజిక మాధ్యమాల్లో వచ్చే అంశాల్లో కొన్ని కొన్ని ఒళ్లు జలదరించేలా ఉంటాయి. పాముల సంగతైతే చెప్పనే అవసరం లేదు. అందులోనూ కొండచిలువ అంటే సరేసరి. కానీ.. ఈసారి దర్శనమిచ్చినది ఆషామాషీ కొండచిలువ కాదు. ప్రపంచంలోనే అత్యంత భారీ, పొడవైన కొండచిలువగా అభివర్ణిస్తున్నారు. ఒక గోడ మీదుగా ఇంటి వరండాలోకి పాకుతున్న భారీ కొండచిలువను ఔత్సాహికులెవరో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

కొంతమంది స్నేక్‌ క్యాచర్స్‌ దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన పాములను ఒడుపుగా పట్టుకుని.. తిరిగి అడవుల్లో వదిలిపెడుతుంటారు. కొంతమంది పాములను పెంపుడు జంతువుల్లా పెంచుకునే వారూ ఉన్నారు. వారి ఇళ్లల్లో పాములు యథేచ్ఛగా తిరుగుతుంటాయి. ఇంకొందరు పాములంటే తెగ భయపడిపోతుంటారు.

యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..

ఈ సంగతులు ఎలా ఉన్నా.. ప్రపంచంలోనే అతి పొడవైనదిగా చెబుతున్న భారీ కొండచిలువ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నది. సునాయాసంగా ఇంటి గోడను అందుకోవడమే కాకుండా.. మెల్లగా ఇంటి వరండాలోకి ప్రవేశించిన ఆ కొండచిలువను చూసి నెటిజన్లు దడుచుకుంటున్నారు.

ఫ్రిజ్‌లోకి దూరిన నాగుపాము.. వీడియో చూస్తే వ‌ణికిపోవాల్సిందే..u

అయితే హాలీవుడ్ సినిమాల పుణ్యమా అని అనకొండలు అతిపెద్ద పాములని ఇన్నాళ్లు అనుకుంటున్నామని కానీ కొండచిలువలు అతి పెద్దవని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Viral Video | నాగుపాముకు స్నానం చేయించిన యువ‌కుడు

కాగా ఇప్పడు ఈ వీడియోలో ఉన్నది ప్రపంచంలోనే అతిపెద్ద రకం కొండ చిలువ. దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలో ఈ జాతి కొండచిలువలు అధికంగా కనిపిస్తాయి. ఇవి గరిష్ఠంగా 16 అడుగుల వరకు పెరుగుతాయి.

Inland Taipan | ఈ పాము కాటేస్తే ఒకేసారి 100 మంది బ‌లి

వీటిని మలయోపైథాన్‌ రెటిక్యులటస్‌ అని పిలుస్తారని ఈ పోస్టులో రాసి ఉన్నది. ఇలాంటి వీడియోలకు హెచ్చరిక అని బోర్డు పెట్టి పోస్టు చేయాలని ఒక నెటిజన్‌ వ్యాఖ్యానించగా.. హమ్మయ్య.. మా ఇంట్లోకి రాలేదు.. అని మరొకాయన రిలీఫ్‌ ఫీలయ్యాడు.

20 అడుగుల గిరి నాగుపాము.. చూస్తే వ‌ణుకు త‌ప్ప‌దు..