Site icon vidhaatha

తెలంగాణ కాంగ్రెస్‌ – బీజేపీల మధ్య హోరాహోరి

విధాత, హైదరాబాద్‌ : తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్‌ పార్టీకి, బీజేపీకి మధ్య హోరాహోరి పోటీ సాగుతుంది. కాంగ్రెస్‌ పార్టీ 8 స్థానాల్లో, బీజేపీ 8స్థానాల్లో , ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యతలో ఉన్నాయి. కాంగ్రెస్‌ ఆధిక్యతలో ఉన్న సీట్లలో ఖమ్మంలో రామసహాయం రఘురాంరెడ్డి, నల్లగొండలో కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్‌లో బలరాం నాయక్, పెద్దపల్లిలో వంశీ కృష్ణ, నాగర్ కర్నూల్‌లో మల్లు రవి, వరంగల్‌లో కడియం కావ్య, భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, జహీరాబాద్‌లో సురేష్‌ షేట్కార్‌లు గెలుపు బాటలో సాగుతున్నారు. బీజేపీకి సంబంధించి కరీంగనగర్‌లో బండి సంజయ్‌, మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌, సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి, నిజమాబాద్‌ ధర్మపురి అరవింద్‌, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో నగేశ్‌, మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, మెదక్‌లో రఘునందన్‌రావులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. హైదారాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఆధిక్యతలో ఉన్నారు. బీఆరెస్‌ పార్టీ ప్రస్తుతం ఒక్క సీటులో కూడా ఆధిక్యతలో లేదు.

Exit mobile version