విధాత: దిగ్గజ మొబైల్ కంపెనీ రియల్ మీ సంస్థ తీసుకోస్తమన్న బాహుబలి 10,001mAh బ్యాటరీ మొబైల్ లాంచ్ డేట్ ను ప్రకటించింది. 10,001 ఎంఏహెచ్ బ్యాటరీతో సిద్ధమైన రియల్‌మీ పీ4 పవర్ మొబైల్‌ను జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్‌లో లాంచ్ చేయబోతుంది. రియల్‌మీ పీ4 పవర్ 5జీ 10,001mAh టైటాన్ బ్యాటరీతో వస్తుంది.బిగ్ బ్యాటరీతో మొబైల్ తీసుకొస్తామంటూ రియల్‌మీ చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసింది. రియల్‌మీ పీ4 పవర్ 5జీ ఒక్క ఛార్జ్‌లో 32.5 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ కూడా ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది. ఫోన్ 86% బ్యాటరీతో ఉండగానే గేమింగ్ చేయడానికి రెండు గంటల వరకు సమయం ఇస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్ BIS సర్టిఫికేషన్ పొందింది.
ఈ బాహుబలి బ్యాటరీ మొబైల్ ఫోన్ 6.78 అంగుళాల 1.5K రిజల్యూషన్ 4D కర్వ్+ డిస్ప్లే తో వస్తుంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్ ను అందిస్తుంది. మైక్రోసైట్ ప్రకారం ఫోన్ ఇండియాలో ట్రాన్స్‌సిల్వర్, ట్రాన్స్‌ఒరేంజ్, ట్రాన్స్‌బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్టు చేస్తుంది. మొబైల్ బరువు సుమారు 220 గ్రాములు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డిజైన్ విషయంలో, ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ను స్క్వేర్ ఆకారపు కెమెరా మాడ్యూల్ లో కలిగి ఉంటుంది. ఫోన్ డ్యూయల్ టోన్ రియర్ ప్యానెల్ తో, ఫ్లాట్ ఫ్రేమ్ తో కనిపిస్తుంది. రియల్‌మీ పీ4 పవర్ 5జీ ఫోన్ ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా ఫోన్ అందుబాటులో ఉంటుంది. రియల్‌మీ పీ4 పవర్ స్మార్ట్‌ఫోన్ 5జీ 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం బాక్స్ ప్రైస్ రూ. 37,999గా ఉండవచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలు వారం రోజుల్లోగా వెల్లడికానున్నాయి.
ఇవి కూడా చదవండి :
Telangana High Court | పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై జబర్ధస్త్ తగదు : హైకోర్టు కీలక ఆదేశాలు
Jubilee Hills Police Station : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత..పోలీసుల లాఠీచార్జ్
