విధాత :ప్రముఖ మైుబైల్ ఫోన్ సంస్థ రియల్ మి సంస్థ ఎక్కువ చార్జింగ్ శక్తితో కూడిన భారీ బ్యాటరీతో కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇతర మొబైల్ కంపనీలకు ధీటుగా తొలిసారిగా 10,001mah బ్యాటరీ సామర్థ్యంలో రియల్ మి పీ 4 పవర్ మోడల్ ఫోన్ ను విడుదల చేసింది.
బాహుబలి బ్యాటరీ హైలట్
రియల్ మీ పీ4 పవర్ మోడల్ 5జీ కెమెరా ఫోన్ లో ప్రధాన ఆకర్షణ, ప్రత్యేకత 1,001 mah బ్యాటరీ. ఇప్పటివరకూ భారత్ లో ఇంత పెద్ద బ్యాటరీతో ఏ మొబైల్ ఫోన్ రాలేదు. నెక్స్ట్ జనరేషన్ సిలికాన్ కార్బన్ ఆండ్ టెక్, డ్యూయల్ లేయర్ కోటింగ్ ప్రాసెస్, సీ ప్యాక్ ప్రొటెక్షన్ బోర్డు వంటి కీలక ఫీచర్లతో, భద్రతా ప్రమాణాలతో బిగ్ బ్యాటరీని తీసుకొచ్చారు. మార్కెట్ లో ఉన్న మొబైల్ ఫోన్ల బ్యాటరీలతో పోలిస్తే కొత్త రియల్ మి ఫోన్ బ్యాటరీ జీవిత కాలం 30శాతం అదనం, 8ఏళ్ల పాటు పనిచేసే సామర్థ్యం, నాలుగేళ్ల వారెంటీ, సడెన్ చార్జింగ్ డౌన్ సమస్య వస్తే రిప్లేసింగ్ వంటి ఆఫర్లను అందించడం విశేషం. బాక్స్‌లో 80W సూపర్ వూక్ ఛార్జర్‌ను ఇస్తున్నారు. 36 నిమిషాల్లో 50 శాతం మొబైల్ ఛార్జ్ అవుతుంది. కేవలం 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే సగం రోజు వరకు ఫోన్ వాడుకోవచ్చని, 27w రివర్స్ ఛార్జ్ ఆప్షన్ ద్వారా ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు అని కంపెనీ పేర్కొంది.
ఏఐ ఫీచర్లతో ఫోన్ కెమెరాలు
రియల్‌మి పీ4 పవర్ 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ 4డీ కర్వ్ డిస్‌ప్లేతో రానుంది. 144Hz రిఫ్రెష్ రేటు, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్ సపోర్ట్ ఉంటాయి. పెర్ఫామెన్స్ విషయానికొస్తే ఇందులో 2.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ అమర్చారు. ఐపీ 68, ఐపీ 69, ఐపీ 66 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉంది.
ఈ ఫోన్ వెనుకవైపు డ్యుయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఏఐ ఫీచర్‌తో రానున్న ఈ కెమెరాలు ఫొటోలకు అదనపు హంగులు కల్పిస్తాయి. 50 ఎంపీ (సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సర్) మెయిన్ కెమెరాతో వస్తున్న ఈ మొబైల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. రెండో కెమెరా 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. మెయిన్ కెమెరాతో 4కె, 30fpsలో వీడియోలను రికార్డు చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా 1080p వరకే సపోర్ట్ చేస్తుంది.
మూడు వేరియంట్లు..ధరలు తక్కువే
రియల్ మి పీ 4 పవర్ మోడల్ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. 8 జీబీ+ 128 జీబీ వేరియంట్ ధర రూ.23,999. 8 జీబీ+ 256 జీబీ వేరియంట్ ధర రూ.29,999. హైఎండ్ వేరియంట్ 12 జీబీ+ 256 జీబీ వేరియంట్ రూ.28,999. రియల్‌మి యూఐ 7.0 ఆధారిత ఆండ్రాయిడ్ 16తో రానున్న ఈ మొబైల్‌కు మూడేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనున్నారు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డులతో కొనుగోళ్లపై రూ.2 వేలు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. లేదా ఎక్స్ఛేంజీ బోనస్ రూ.2 వేలు లభిస్తుంది. ఫిబ్రవరి 5 నుంచి realme.com, Flipkart వెబ్‌సైట్స్ ద్వారా ఈ మొబైల్ కొనుగోలుకు అవకాశం కల్పించారు.
ఇవి కూడా చదవండి :
Amazon LayOffs : ఊహించినట్టే జరిగింది.. 16 వేల మందిపై వేటు వేసిన అమెజాన్
MSG | బాక్సాఫీస్ బాస్ మెగాస్టార్.. ఓవర్సీస్‌లోనూ ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రభంజనం
