Site icon vidhaatha

మీరాబాయి చానుకు మరో ఆఫర్

విధాత:టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి చానుకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఐనాక్స్ మల్టీప్లెక్స్ మూవీచైన్ సంస్థ ఆమెకు జీవితాంతం మూవీ టికెట్లు ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ మీరాకు మాత్రమే కాకుండా ఈ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ప్రతి అథ్లెట్‌కు వర్తిస్తుందని ఐనాక్స్ పేర్కొంది. అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్ అందరికీ ఒక ఏడాది పాటు ఈ ఆఫర్ వర్తింపజేస్తామని ట్విటర్ పేజీ ద్వారా ఐనాక్స్ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. డొమినోస్ పిజ్జా వారు కూడా ఆమెకు లైఫ్‌టైం ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మీరాబాయికి లైఫ్‌టైం ఫ్రీగా పిజ్జాలు ఇస్తామని ప్రకటించింది. ఇక ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి విశ్వవేదికపై భారతీయ జెండాను రెపరెపాలాడించిన మీరాబాయిపై కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారత రైల్వేశాఖ రూ.2కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించగా, మణిపూర్ సర్కార్ కూడా కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం అందించింది.

Exit mobile version