Russia | ఆత్రంపడ్డారు.. ఆగమయ్యారు! చంద్రునిపై కూలిన రష్యా ల్యాండర్

ల్యాండింగ్ సమయంలో దుర్ఘటన రష్యన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటన చంద్రయాన్-3 తర్వాత ప్రయోగం ముందే ల్యాండింగ్కు ప్రయత్నం

  • Publish Date - August 20, 2023 / 05:57 PM IST

Russia

  • ల్యాండింగ్ సమయంలో దుర్ఘటన
  • రష్యన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటన
  • చంద్రయాన్-3 తర్వాత ప్రయోగం
  • ముందే ల్యాండింగ్కు ప్రయత్నం

మాస్కో: చంద్రుడిపైకి ముందెళతా.. ముందెళతా అన్న రష్యా ల్యాండర్ లూనా.. చివరకు.. చంద్రుడిపై దిగే సమయంలో కుప్పకూలింది. ఇస్రో చంద్రయాన్-3ని ప్రయోగించిన తర్వాత బయల్దేరిన రష్యా లూనా-25.. చంద్రయాన్కంటే ముందే దిగేలా దూసుకెళ్లింది.

అయితే.. చంద్రుడిపై ల్యాండ్ అయ్యే సమయంలో కూలిపోయిందని రష్యా స్పేస్ ఏజెన్సీ ఆదివారం ప్రకటించింది. ప్రొపల్షన్ విన్యాసంలో దారి తప్పడం, అనుకోని కక్ష్యలోకి ప్రవేశించడం వల్లే ఈ పరిణామం చోటు చేసుకున్నదని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

లూనా-25 అనేది దాదాపు 50 ఏళ్ల వ్యవధిలో రష్యా తొలి మూన్ మిషన్. లూనా-25తో శనివారం 11.57 జీఎంటీ (భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.57 గంటలకు) సంబంధాలు తెగిపోయాయని రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కాస్మోస్ తెలిపింది.

Latest News