Site icon vidhaatha

Chandrayaan 3 | ప్రజ్ఞాన్ రోవర్.. బతికేది ఇంకో వారం రోజులే.

Chandrayaan 3 |

శశిపై ఇక నిశి!
మరో వారం రోజులు ఆగితే
చీకట్లు ముసురుతాయ్.
ప్రజ్ఞాన్ రోవర్ బతికేది
ఇంకో వారం రోజులే.
‘అర్ధాయుష్షు’ ముగిసినట్టే.
ప్రయాణించింది 8 మీటర్లు.
చంద్రుడిపై పగలు 14 రోజులు.
చీకటి కూడా 14 రోజులు.
చంద్రుడిపై ‘ప్రజ్ఞాన్’ దిగి
వారం రోజులు కావస్తోంది.
జాబిలి ఉపరితలంపై రోవర్
దిగిన దక్షిణ ధృవ ప్రాంతంలో
మరో వారంలో చీకటి పడుతుంది.
రోవర్ దిగిన చోటుకు అవతలి వైపు
(చంద్రుడి రెండోవైపు) ఎండ వస్తుంది.
‘ప్రజ్ఞాన్’ రోవర్ పరికరాలు కేవలం
సౌరశక్తి ఆదారంగా పనిచేస్తాయి.
చంద్రుడిపై చీకట్లో మైనస్ 230 డిగ్రీల
ఉష్ణోగ్రతల్లో పరికరాలు ‘స్తంభిస్తాయి’.
అంటే… రోవర్ ‘చనిపోయినట్టే’.
14 రోజుల అతి శీతల చీకటిని
సమర్థంగా తట్టుకుని ఆ తర్వాత
వచ్చే పగటిపూట నాటికి
రోవర్ ఎలాగోలా జీవించగలిగితే
బహుశా మరో 14 రోజులు
దాని సేవలు మనకు అందవచ్చు.
అది ఇస్రో అదృష్టంపై ఆధారపడివుంది.

Aditya-L1 | సదా రవిని గాంచు చోటు.. ఇస్రో గాంచెన్

ISRO | శ్రీ సూర్యనారాయణా.. మేలుకో! ఇస్రోకు సరికొత్త సవాలు.. చేరవలసిన లక్ష్యం అదిగో..

Exit mobile version