Site icon vidhaatha

Arjun Tendulkar | సానియాను పెళ్లాడ‌నున్న అర్జున్ టెండూల్క‌ర్..!

Arjun Tendulkar | క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్( Sachin Tendulkar ) ఇంట త్వ‌ర‌లోనే పెళ్లి బాజాలు మోగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. టెండూల్క‌ర్ త‌న‌యుడు అర్జున్ టెండూల్క‌ర్( Arjun Tendulkar ) ఓ ఇంటి వాడు కాబోతున్న‌ట్లు వార్త‌లు షికారు చేస్తున్నాయి. ముంబైకి చెందిన సానియా చాందోక్‌( Saaniya Chandok )తో అర్జున్ నిశ్చితార్థం జ‌రిగిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు ఊరేగుతున్నాయి. వీరి నిశ్చితార్థ వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాల స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే అర్జున్ టెండూల్క‌ర్, సానిచా చాందోక్ ఎంగేజ్‌మెంట్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

ఎవ‌రీ సానియా చాందోక్‌..?

అర్జున్ టెండూల్క‌ర్ స‌చిన్ కుమారుడిగా అంద‌రికి సుప‌రిచిత‌మే. కానీ సానియా చాందోక్ మాత్రం ఎవ‌రికీ తెలియ‌దు. ఇప్పుడు ఆమె ఎవ‌రా..? అని గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే సానియా.. ముంబైకి చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ర‌వి ఘాయ్(Ravi Ghai ) మ‌నువ‌రాలే అని తేలింది. వీరి కుటుంబం ఆతిథ్య‌, ఆహార రంగాల్లో వ్యాపారాలు కొన‌సాగిస్తున్నారు. ఇంట‌ర్ కాంటినెంట‌ల్ హోట‌ల్( InterContinental hotel  ), ప్ర‌ముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ బ్రూక్లిన్ క్రీమ‌రీ( Brooklyn Creamery ) పాటు ప‌లు వ్యాపారాలు సానియా ఫ్యామిలీకి ఉన్నాయి. ఇక సానియా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది. మిస్ట‌ర్ పాస్ పెట్ స్పా అండ్ స్టోర్ భాగస్వామిగా, డైరెక్టర్‌గా సానియా కొన‌సాగుతున్నారు.

Exit mobile version