Hardik Pandya| హార్ధిక్ పాండ్యాకి కొద్ది రోజులుగా గడ్డు కాలం నడుస్తుంది. ముంబైకి ఐపీఎల్ కెప్టెన్‌గా ఉన్నా అతనికి రోహిత్ ఫ్యాన్స్ నుండి ముంబై ఫ్యాన్స్ నుండి దారుణమైన విమర్శలు వచ్చాయి. ఇక ఇటీవల సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకొని విడిపోయారు. వీళ్లిద్దరికీ ఓ బాబు అగస్త్య కూడా ఉన్నాడు. కొన్నాళ్ల పాటు నటాషాతో డేటింగ్ చేసిన హార్దిక్.. 2020లో పెళ్లి చేసుకొని ఊహించని విధంగా డైవర్స్ తీసుకున్నాడు. అయితే మాజీ భార్యకి విడాకులు ఇచ్చిన నెల రోజుల్లోనే మరో అమ్మాయితో డేటింగ్ మొదలుపెట్టడం విశేషం. బ్రిటీష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో టీమిండియా ఆల్ రౌండర్ డేటింగ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల వీరిద్దరూ కలిసి విహార యాత్రకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియోను హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అయింది. అయితే అదే ప్లేస్‌లో నాలుగు రోజుల క్రితం అదే ప్లేస్‌లో తీసుకున్న వీడియోను జాస్మిన్ వాలియా కూడా తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. సింగర్ జాస్మిన్ .. బ్లూ కలర్ బికినీ.. బ్లూ షర్ట్‌తో .. ఓ పూల్ వద్ద కనిపించగా, ఆ ఫోటో బ్యాక్‌డ్రాప్‌లో మైకోనస్ సీనరి కనిపిస్తోంది. స్ట్రా హ్యాట్, ఓవర్‌సైజ్ సన్‌గ్లాసెస్‌తో ఆమె లుక్ అదిరిపోయింది.
ఇక అదే పూల్ వద్ద ఉన్న వీడియోను హార్దిక్ పోస్టు చేయగా, ఆయన క్రీమ్ కలర్ ప్యాంట్, ప్రింట్ షర్ట్, సన్‌గ్లాసెస్‌తో స్టన్నింగ్ లుక్‌లో కనిపించాడు. ఫోటోల్లో ఇద్దరి బ్యాక్‌గ్రౌండ్ మ్యాచ్ కావడంతో ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా మంది భావిస్తున్నారు. భారత్-శ్రీలంక సిరీస్ సందర్భంగా ఆమె శ్రీలంకలో ఉండటం నేను చూశాను. ప్రతి మ్యాచ్ కు ఆమె స్టేడియంకి వచ్చేది. హార్దిక్ పచ్చబొట్టును పోలిన టాటూ ఉన్న చేతి చిత్రాలను ఆమె పోస్ట్ చేసేదని ఓ నెటిజన్ తెలియజేశాడు. కాగా, జాస్మిన్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌కు చెందిన జాస్మిన్ టీవీ సిరీస్‌లు, పలు రియాలిటీ షోల్లో పాల్గొని పాపులారిటీ సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 6.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బ్రిటీష్ రియాల్టీ టీవీ సిరీస్ ద ఓన్లీ వే ఈజ్ ఎసెక్స్ లో నటించిన తర్వాత ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.