Koneru Humpy | Chess | కోనేరు హంపి తెలుగు ప్రజలకు గర్వకారణం

సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

Koneru Humpy | Chess | విధాత : జార్జీయాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్(FIDE Women’s Chess World Cup) లో భారత మహిళ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ(Koneru Humpy) సెమి ఫైనల్ కు చేరుకుంది. ఈ మేరకు కోనేరు హంపికి భారత ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎక్స్ వేదికగా కోనేరు హంపికి(Koneru Humpy) శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎఫ్ఐడీఈ ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు చేరిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి నా ప్రత్యేక అభినందనలు. ఈ లీగ్ లో చేరిన తొలి భారతీయ మహిళ కోనేరు హంపి కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం. ఆమె విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను’ అని అభినందనలు తెలిపారు. కాగా, ఎఫ్ఐడీఈ ఉమెన్స్ వరల్డ్ కప్లో(FIDE Women’s World Cup) ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో కోనేరు హంపీ 1.5-0.5 తేడాతో చైనా క్రిడాకారిణీ సాంగ్ పై విజయం సాధించారు.