ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండియా 100 పతకాలు సాధించింది. ఇప్పటి వరకు భారత్‌కు 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యం పతకాలతో, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. తాజాగా మహిళల కబడ్డీ ఫైనల్‌లో చైనీస్ జట్టును చిత్తు చేస్తూ భారత్ స్వర్ణంతో మెరిసిపోయింది.
ఇక ఆర్చరీ ఈవెంట్‌లో మొత్తం నాలుగు పతకాలను భారత్ కైవసం చేసుకుంది. ఆర్చరీలో భారత్‌కు మరో 2 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం పతకం వచ్చాయి. ఆర్చరీ మహిళల కాంపౌండ్ సింగిల్స్‌లో జ్యోతి సురేఖకు స్వర్ణం, అదితి గోపిచంద్‌కు కాంస్యం, ఆర్చరీ పురుషుల కాంపౌండ్ సింగిల్స్‌లో ఓజాస్ డియోటలేకు స్వర్ణం, అభిషేక్ వర్మకు రజతం వరించింది.