Site icon vidhaatha

PV Sindhu| పీవీ సింధు ఖాతాలో మ‌రో విజ‌యం.. ప్రీ క్వార్టర్స్​లోకి ఎంట్రీ

PV Sindhu| పారా ఒలంపిక్స్‌లో పీవీ సింధు దుమ్ము రేపుతుంది. తాజాగా జరిగిన మహిళల సింగిల్స్​లో పీవీ సింధు దూకుడుగా ఆడి రెండో రౌండ్‌లోను గెలిచింది. గ్రూప్‌ స్టేజ్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించ‌డంతో డైరెక్ట్‌గా ప్రీ కార్ట‌ర్స్ లోకి వెళ్లింది. రెండో రౌండ్‌లో ఎస్టోనియాకు చెందిన యంగ్ ప్లేయర్ క్రిస్టిన్‌ కూబా పై 21-5, 21-10 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సింధు గ్రూప్‌-M నుంచి ప్రీ క్వార్టర్స్​​కు చేరుకుంది. అయితే సింధు ఈ మ్యాచ్​ను కేవలం 34 నిమిషాల్లోనే ముగించ‌డం విశేషంగా చెప్పుకోవాలి. తొలి రౌండ్‌లో సింధు మాల్దీవులకు చెందిన అబ్దుల్ రజాక్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ప్రత్యర్థిని చిత్తు చేసి కేవలం 29 నిమిషాల్లోనే 21-9, 21-6తో మ్యాచ్‌ను ముగించింది. గత కొన్నాళ్లుగా ఫామ్ లేనప్పటికీ విశ్వక్రీడల్లో తానెంత ప్రమాదకరమో చాటిచెప్పింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు సింధు కేవలం 29 నిమిషాలు పట్టింది. కాగా, పీవీ సింధు పీవీ సింధు రియో ​​ఒలింపిక్స్‌లో రజత పతకం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో కూడా మెడల్ సాధిస్తే హ్యాట్రిక్ పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది.

.కామన్వెల్త్ గేమ్స్-2022 తర్వాత మోకాలి గాయం నుంచి కోలుకున్న అనంతరం 2023 అక్టోబర్ 27న సింధు తిరిగొచ్చింది. ఆ స‌మ‌యంలో సింధు శ్రమ, ఫ్యామిలీ సపోర్ట్, దేశం ప్రార్థనలు ఆమెను తిరిగి ఫామ్‌లోకి తెచ్చి పెట్టాయని, ఇప్పుడు తిరిగి ఆమె ప‌త‌కం సాధిస్తుంద‌ని పీవీ సింధు తండ్రి చెప్పుకొచ్చారు. 29 ఏళ్ల సింధు పారిస్‌కు రాకముందు, సింధు జర్మనీలోని సార్‌బ్రూకెన్‌లోని స్పోర్ట్‌క్యాంపస్ సార్‌లో శిక్షణ పొందింది, ఇక్కడ ఎత్తు, వాతావరణం, ఇత‌ర పరిస్థితులు ఫ్రెంచ్ రాజధాని పారిస్ మాదిరిగా ఉంటాయి. అక్క‌డి పరిస్థితులకు అనుగుణంగా, ఆమె తన గదిలో ఒక హైపోక్సిక్ చాంబర్ (తక్కువ ఆక్సిజన్) కూడా సృష్టించుకొని ప‌డుకుంది. హైపోక్సిక్ ఛాంబర్లు ఎత్తైన ప్రదేశాలలో ఆడటానికి ఆటగాడి శరీరాన్ని సిద్ధం చేయడంలో సహాయపడతాయి.

Exit mobile version