విధాత: కృష్ణాజిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) సహాయ సహకారాలతో నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్ లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల సీనియర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ ముగిసింది. పురుషుల వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో జి.అజయ్ కుమార్ ఛాంపియన్ గా నిలువగా కె.సుహృద్ అమృ ద్వితీయ, ఎస్.విహిత్ తృతీయ స్థానం దక్కించుకున్నారు. మహిళల వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో ఎన్.అనూష చాంపియన్ గా నిలువగా ఎస్.యశస్వి, పి.లావణ్య లు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా శాప్ పరిశీలకులు వై.శివరామకృష్ణ, విశిష్ట అతిథిగా రాష్ట్ర సంఘ కోశాధికారి అబ్దుల్ కరీమ్ పాల్గొని ట్రోఫీలను, పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దారం నవీన్ కుమార్, సంయుక్త కార్యదర్శి ఎస్.నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు డి.మునయ్య, వివిధ జిల్లాల కార్యదర్సులు పాల్గొన్నారు.