T20 World Cup| శ‌నివారం జ‌రిగిన రెండు థ్రిల్లింగ్ మ్యాచెస్‌.. భ‌య‌పెట్టిన ఆస్ట్రేలియా

T20 World Cup| టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో సంచ‌లనాలు న‌మోద‌వుతున్నాయి. చిన్న జ‌ట్లే అనుకుంటే అవి టైటిల్ ఫేవ‌రేట్స్‌కి కూడా షాకిస్తున్నాయి. శనివారం రోజు రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ జ‌రిగాయి.ఈ రెండు మ్యాచ్‌లు చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. సౌతాఫ్రికా-నెద‌ర్లాండ్స్ మ‌ధ్య జ‌రిగిన పోరులో ద‌క్షిణా

  • Publish Date - June 9, 2024 / 06:32 AM IST

T20 World Cup| టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో సంచ‌లనాలు న‌మోద‌వుతున్నాయి. చిన్న జ‌ట్లే అనుకుంటే అవి టైటిల్ ఫేవ‌రేట్స్‌కి కూడా షాకిస్తున్నాయి. శనివారం రోజు రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ జ‌రిగాయి.ఈ రెండు మ్యాచ్‌లు చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. సౌతాఫ్రికా-నెద‌ర్లాండ్స్ మ‌ధ్య జ‌రిగిన పోరులో ద‌క్షిణాఫ్రికా పోరాడి గెల‌వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో సైబ్రాండ్(45 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 40), లోగన్ వాన్ బీక్(22 బంతుల్లో 3 ఫోర్లతో 23) మాత్ర‌మే ఎక్కువ ప‌రుగులు చేశారు. మిగ‌తా వారంతా వెంట‌వెంట‌నే ఔట‌య్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఓట్‌నెలి బార్ట్‌మన్(4/11) నాలుగు వికెట్లతో నెదర్లాండ్స్ పతనాన్ని శాసించగా.. అన్రిచ్ నోకియా(2), మార్కో జాన్సెన్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఇక 104 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా జ‌ట్టు ఆ టార్గెట్‌ని చేధించేందుకు ముప్పుతిప్ప‌లు ప‌డింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్(0), రీజా హెండ్రీక్స్(3), ఎయిడెన్ మార్క్‌రమ్(0) వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో సౌతాఫ్రికా 3 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక హెన్రీచ్ క్లాసెన్(4)కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండ‌లేదు. మొయిన్ బ్యాట్స్‌మెన్స్ అంతా ఔట్ కావ‌డంతో నెద‌ర్లాండ్స్ సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని డేవిడ్ మిల్లర్( 59 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(37 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 33) అద్వితీయ‌ ప్రదర్శనతో ఓటమిని తప్పించారు. 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 106 పరుగులు చేసి గెలుపొందింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వివియన్(2/12) లోగాన్ వాన్ బీక్(2/21) రెండు వికెట్లు తీయగా.. బాస్ డీ లీడే ఓ వికెట్ పడగొట్టాడు.

ఇక టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన‌ బిగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 201 ప‌రుగులు చేసింది. హెడ్(18 బంతుల్లో 34 పరుగులు), డేవిడ్ వార్నర్ (16 బంతుల్లో 39 పరుగులు), మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 35 పరుగులు), గ్లెన్ మాక్స్‌వెల్ (25 బంతుల్లో 28 పరుగులు), మార్కస్ స్టోయినిస్ (17 బంతుల్లో 30 పరుగులు), అద్భుతంగా రాణించ‌డంతో భారీ స్కోర్ సాధించింది. ఇక ల‌క్ష్య చేధ‌న‌కి దిగిన ఇంగ్లండ్ భారీ ల‌క్ష్యాన్ని చేధించ‌లేక చ‌తికిల ప‌డింది. 20 ఓవ‌ర్ల‌ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి కేవ‌లం 165 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిలిప్ సాల్ట్ (23 బంతుల్లో 37 ప‌రుగులు), జోస్ బట్లర్ (28 బంతుల్లో 42 పరుగులు), మొయిన్ అలీ (15 బంతుల్లో 25 పరుగులు), హ్యారీ బ్రూక్ (16 బంతుల్లో 20 పరుగులు నాటౌట్) రాణించిన‌ప్ప‌టికీ లక్ష్యాన్ని చేధించలేకపోయారు.

Latest News