T20 World Cup-2026 | టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ రిలీజ్.. ఈసారి స్పెషల్ ఏంటంటే?

2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.

విధాత, హైదరాబాద్ :

2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. అహ్మదాబాద్‌ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. ICC ప్రకటించిన తాజా షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నమెంట్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు కొనసాగుతుంది. ఈసారి భారత్, శ్రీలంక సంయుక్తంగా టోర్నికి ఆతిథ్యం ఇస్తున్నాయి.

మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీని రెండు దేశాల్లోని ఎనిమిది ప్రధాన క్రికెట్ స్టేడియాల్లో నిర్వహించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే గ్రూప్ దశ ఫిబ్రవరి 20 వరకు కొనసాగనుంది. అనంతరం ఫిబ్రవరి 21 నుంచి “సూపర్ 8” పోటీలు ప్రారంభం అవుతాయి. గ్రూప్ దశలో అర్హత పొందిన ఎనిమిది జట్లు సూపర్ 8 లో పోటీపడుతాయి.

మార్చి 5, 6 తేదీల్లో సెమీఫైనల్స్ జరుగుతాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో మొదటి సెమీఫైనల్ నిర్వహించనుండగా.. రెండో సెమీఫైనల్ కోలకత ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. చివరగా, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించడానికి ఐసీసీ నిర్ణయించింది. భారత్‌లో అహ్మదాబాద్, ముంబయి, ఢిల్లీ, చెన్నై, కోల్‌కత్తా స్టేడియాలు వేదికలు కానుండగా, కానుండగా, శ్రీలంకలో కొలంబో, కండి ప్రధాన వేదికలుగా ఎంపిక అయ్యాయి.

ఈ ఈవెంట్ లో గ్రూప్ మ్యాచ్‌ల నుంచి సూపర్ 8, తర్వాత నేరుగా సెమీఫైనల్స్ ప్రక్రియ ఉండడం వల్ల పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. ప్రతి జట్టుకు గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లు నిర్వహించేలా ఐసీసీ ప్రణాళిక రచించిన్లు తెలుస్తోంది. కాగా, అత్యధిక స్పెక్టేటర్స్ సీటింగ్ కెపాసిటీ ఉన్న భారత వేదికలు, ముఖ్యంగా అహ్మదాబాద్ స్టేడియం, ఈ ప్రపంచకప్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. క్రికెట్ ను ఎంతగానో ఇష్టపడే భారత్, శ్రీలంకలో మెగా టోర్ని జరగనుండడంతో ఇరు దేశాల ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు.

Latest News