విధాత:టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు బీసీసీఐ నగదు నజరానా ప్రకటించింది. బీసీసీఐ సెక్రటరీ జైషా ట్వీట్ చేస్తూ ఆ విషయాన్ని వెల్లడించారు.ఈ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఏకైక స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు బహుమతిగా ప్రకటించారు. రజతం సాధించిన మీరాబాయి చాను, రవి దాహియాకు చెరో అర కోటి ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే కాంస్య పతకాలు సాధించిన బజరంగ్ పూనియా, లవ్లీనా బార్గోహేన్, పీవీ సింధుకు తలా రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత హాకీ జట్టుకు రూ.1.25 కోట్ల నగదు నజరానా ప్రకటించారు.