విధాత: ఆదివారం రాత్రి బ్లూమూన్ కనిపించనున్నట్లు అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ వెల్లడించింది. ఒకవేళ ఆదివారం రాత్రి ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటే అందరూ ఈ బ్లూమూన్ చూడొచ్చు.
ఒక సీజన్‌లో సాధారణంగా మూడు పౌర్ణములు ఉంటాయి. అయితే నాలుగు పౌర్ణములు ఉండే సీజన్‌లో వచ్చే మూడో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. నాసా ప్రకారం రెండు రకాల బ్లూమూన్స్ ఉంటాయి. ఒకటి నెలవారీగా, మరొకటి సీజనల్‌గా వచ్చే బ్లూమూన్.