Site icon vidhaatha

My Home Bhooja Ganesh Utsav Laddu| మై హోమ్ భూజాలో రికార్డు బ్రేక్ చేసిన లడ్డు వేలం పాట

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ మాదాపూర్ మై హోమ్ భూజా(My Home Bhooja)లో వినాయక నవరాత్రి ఉత్సవాల లడ్డు వేలం(Ganesh Utsav Laddu Auction) పాట రికార్డు బ్రేక్(Record Breaking Auction) చేసింది. హోరా హోరీగా సాగిన వేలం పాటలో గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ(Ganesh Real Estate) అధినేత గణేష్ ఇల్లందు(Ganesh Illandu) రూ. 51,07,777లకు లడ్డూను సొంతం చేసుకున్నారు.

గత సంవత్సరం ఇక్కడ లడ్డూ వేలం పాటలో రూ. 29 లక్షలు పలికింది. ఈ ఏడాది ఆ రికార్డు బ్రేక్ అయిపోయింది. ఇప్పటిదాక రాష్ట్రంలో అత్యధిక వేలం పాట రికార్డు బండ్లగూడ జాగీర్ లోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో గత ఏడాది జరిగిన గణేష్ లడ్డూ పేరిట ఉంది. ఇక్కడ లడ్డూ 1కోటీ 87లక్షలకు అమ్ముడుపోయింది. అంతక్రితం ఏటా ఇదే చోట 1కోటీ 25లక్షలకు లడ్డూ వేలం పాట సాగింది. ఇక బాలపూర్ లడ్డూ వేలం ఈ ఏడాది ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. గత ఏడాది బాలపూర్ లడ్డూ రూ.30లక్షలు పలికింది.

 

Exit mobile version