స‌న్న‌బియ్యం సృష్టిక‌ర్త ఎవ‌రో మీకు తెలుసా…?

విధాత‌: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టగలరా..? కష్టమే. ఆయన సినిమా నటుడు కాదు, రాజకీయ నాయకుడు అంతకూ కాదు. టిివిల్లో కూడా ఎపుడు కనిపించిన వ్యక్తీ కాదు. మారుమూల్ల పల్లెనుంచి వచ్చి చడీా చప్పుడు లేకుండా తాను చేయాల్సిన మేలు సమాజానికి చేసి, అంతే నిశబ్దంగా మాయమయిన ఒక గొప్ప తెలుగు వ్యవసాయ శాస్త్రవేత్త. సన్నాలు లేదా సాంబామసూరిగా లేదా కర్నూలు సోనా బియ్యం తెలియని వారుండురు. కానీ ఈ సన్నబియ్యం చరిత్ర, వాటి […]

  • Publish Date - September 2, 2021 / 03:33 AM IST

విధాత‌: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టగలరా..? కష్టమే. ఆయన సినిమా నటుడు కాదు, రాజకీయ నాయకుడు అంతకూ కాదు. టిివిల్లో కూడా ఎపుడు కనిపించిన వ్యక్తీ కాదు. మారుమూల్ల పల్లెనుంచి వచ్చి చడీా చప్పుడు లేకుండా తాను చేయాల్సిన మేలు సమాజానికి చేసి, అంతే నిశబ్దంగా మాయమయిన ఒక గొప్ప తెలుగు వ్యవసాయ శాస్త్రవేత్త.

సన్నాలు లేదా సాంబామసూరిగా లేదా కర్నూలు సోనా బియ్యం తెలియని వారుండురు. కానీ ఈ సన్నబియ్యం చరిత్ర, వాటి సృష్టికర్త ఎవరనే విషయం చాలా మందికి తెలియదు. ప్రపంచంలో 40 దేశాలలో రైతులు ఈ పంట పండిస్తున్నారు. ఈ పంట వల్ల ఆహార సమస్య తీరడమేకాదు, ప్రభుత్వాలకు ఆదాయం కోట్లలో జమకూడుతూ ఉంది. అయితే, దీని వెనక ఉన్న శాస్త్రవేత్త గురించి పెద్దగా ఎవ‌రికీ తెలియ‌క‌పోవ‌డం విచారకరం.

ఈ స‌న్న బియ్యం సృష్టి క‌ర్త‌ ఒక మారు మూల కుగ్రామంలోని రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు.బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి. ఆయన పేరు డా. మొరవల్లి వెంకట రమణా రెడ్డి లేదా డాక్టర్ ఎంవీ రెడ్డి (1929-2014). బీపీటీ 5204 రకం వరి వంగడం సృష్టించిన మ‌హ‌నీయుడు.