viral video | ఇంటర్‌నెట్‌లో సరదా వీడియోలకు కొదవలేదు. ఏదో సరదాగా తీసేసిన వీడియోలు (hilarious viral video).. ఉన్నట్టుండి వైరల్ అయిపోతుంటాయి. అందులో ఏదో ఒక విచిత్రం ఆ వీడియోలకు లైకులను తెచ్చిపెడుతుంటాయి. ఎక్కడ తీశారో తెలియదు కానీ.. ఈ వీడియో సైతం అలానే అనిపిస్తుంది. ముందు భయం వేస్తుంది.. ఆ తర్వాత ఆ షాపు సిబ్బంది చేసిన పనికి నవ్వాగదు!
ఎక్కడి నుంచి వచ్చిందో ఒక నాగుపాము వైన్‌షాప్‌లో చొరబడింది. బాటిళ్లను చట్టుకుంది. దానిని ఎలాగోలా బయటకు పంపడానికి ఆ షాపు సిబ్బంది ఒకరు ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఒక కర్ర పట్టుకుని.. ఆ పామును అక్కడి నుంచి తీసేయడానికి ట్రై చేస్తుండగా అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకుంటుంది. ఆ పాము కదలికల సందర్భంగా ఒక బాటిల్ కింద పడబోగా. ఆ వెంటనే.. తొక్కలో ప్రాణం.. అన్నట్టు ఆ వ్యక్తి ఆ పాము సంగతిని మరిచి.. ఆ కర్రను పడేసి.. బాటిల్‌ను మాత్రం సురక్షితంగా క్యాచ్ చేసి మందుపై తన ప్రేమను చూపాడు
దీనికి ఆ వీడియోపై ఒక ఆసక్తికర క్యాప్షన్ పెట్టారు. ‘జాన్ జాయేతో జాయియే.. పర్ బాటిల్ నహీ టూట్నా చాహియే’ (ప్రాణం పోతే పోయింది.. బాటిల్ మాత్రం పగిలిపోకూడదు..) అని రాశారు. ప్రయారిటీ మ్యాటర్స్ అని ఈ వీడియోకు పైన క్యాప్షన్ తగిలించారు. డేంజరస్ సిచ్యుయేషన్‌లో సైతం లిక్కర్‌కు చాలా వాల్యూ ఉంటుందనే అర్థంతో ఈ హస్యస్ఫోరక క్యాప్షన్ నెటిజన్లను తెగ నవ్విస్తున్నది. మనకు బాటిలే ముఖ్యం అని ఒక నెటిజన్ కామెంటాడు. మరొకాయన మనకేం కావాలన్న విషయంలో చాలా క్లారిటీ ఉంది.. బాటిలే ఇంపార్టెంట్ అని రాశాడు.
ఇదీ ఆ వీడియో.. చూసేయండి..
ఇవి కూడా చదవండి..
Preity Zinta Angry | మీడియాపై మండిపడ్డ ప్రీతీ జింటా… అవి ఫేక్ ఫొటోలంటూ ఫైర్
Kaleshwaram Commission: బిగ్ షాక్..కేసీఆర్, హరీష్, ఈటలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
Rift in East Africa | ఆఫ్రికా రెండు ముక్కలు.. ఆరో మహా సముద్రం ఆవిర్భావం?
cricket stadium in forest | ఆ క్రికెట్ మైదానం అమెజాన్ అడవుల్లోనే ఉందా? నిజం తెలిస్తే నివ్వెరపోతారు!
Snakes in Basement | ఇంటి బేస్‌మెంట్‌లో డజన్లకొద్దీ పాముల కుప్ప! వైరల్ అవుతున్న వీడియో