Plants Scream | పీకితే మొక్కలు ఏడుస్తున్నాయట..! అధ్యయనంలో కీలక విషయాలు..!

  • Publish Date - April 6, 2024 / 09:50 AM IST

Plants Scream | మొక్కలు సైతం ఆక్రందనలు చేస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. ఈ ధ్వని చిటికెలు వేసినట్లుగా ఉంటాయని పరిశోధనకులు తెలిపారు. ఇవి మనుషులకు మాత్రం వినబడవని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ పరిశోధనపై ‘సెల్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. చెట్లు, మొక్కలను కూకటివేళ్లతో సహా తొలగించిన సమయంలో లేదంటే కాండాన్ని నరికిన సందర్భంలో అవి ఆక్రందనలు చేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

తమ పరిస్థితిని చుట్టూ ఉన్న జీవాలకు ఆక్రందనను తమదైన శైలిలో మొక్కలు తెలియజేస్తున్నట్లుగా గుర్తించారు. అయితే, సాధారణ సమయాల్లోనూ మొక్కలు పలు రకాల శబ్దాలు చేస్తాయని.. అవి మనిషులు మాత్రం వినలేరని.. కొన్ని శబ్దాలను పలు జంతువులు, కీటకాలు గుర్తిస్తున్నట్లుగా తేల్చారు. అయితే, కీటకాలు, ఇతర జంతువులు సమాచార మార్పిడి కోసం శబ్దాలు చేస్తున్నాయని.. వాటితో నిత్యం ‘సంభాషించే’ మొక్కలు ఎలాంటి శబ్దాలు చేయని భావించడం సరికాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఒత్తిడి సమయాల్లో చెట్లు, మొక్కలు తమ రంగులు మార్చుకోవడం, కొన్ని సమయాల్లో ముడుచుకుపోవడం, ఇతర మార్పులకు లోనవడం సాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే, ఇవి శబ్దాలను వెలువరిస్తాయా?.. అవి ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తల బృందం అధ్యయనం నిర్వహించింది.

అయితే, పరిశోధన కోసం టమాట, పొగాకు మొక్కలను శాస్త్రవేతల్ల బృందం ఎంచుకున్నది. ఇవి కిష్టసమయంలో ఉన్నప్పుడు, సాధారణ సమయంలో చేసే శబ్దాలను పరిశీలించారు. ఇందుకు ప్రత్యేకంగా మెషీన్ లర్నెంగ్ అల్గారిథమ్‌ని వినియోగించారు. దాని సహాయంతో మొక్కలు వివిధ సందర్భాల్లో చేసిన శబ్దాల మధ్య భేదాలను పరిశీలించారు. ఒత్తిడి సమయాల్లో మొక్కలు మీటర్‌ దూరం వరకు వినిపించేలా హై పిచ్ శబ్దాలు చేస్తాయని తేలింది. మిగతా సమయాల్లో ప్రశాంతంగానే ఉన్నట్లుగా నిపుణులు గుర్తించారు. అయితే, మొక్కలు ఈ శబ్దాలను ఎలా చేస్తాయనేది పూర్తిగా తెలియాల్సి ఉన్నది.

Latest News