Tiger roadside video| వామ్మో.. రోడ్డు పక్కన మాటేసిన పెద్దపులి

మంచిర్యాల జిల్లా సింగరాయకొండ, దొంగపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కన పెద్దపులి సంచారం వాహనాదారులను భయపెట్టింది.

విధాత : అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి రోడ్డు(Tiger)పైన గర్జిస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచిర్యాల(Mancherial) జిల్లా సింగరాయకొండ, దొంగపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కన(road side) పెద్దపులి సంచారం జనాన్ని హడలెత్తించింది. ఆ మార్గంలో వెలుతున్న ప్రజలు రోడ్డు పక్కనే కల్వర్టుపై తాపీగా కూర్చుని గర్జిస్తున్న పెద్దపులిని చూసి భయంతో వెనక్కి వెళ్లిపోయారు. పెద్దపులి గర్జనలతో కూడిన దృశ్యాలను కారులో వెలుతున్న వాళ్లు ఆగి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది.

కాసేపటికి పెద్దపులి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాక..ప్రయాణికులు బిక్కుబిక్కుమంటునే ముందుకు వెళ్లిపోయారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు, ప్రజలు ఎవరు కూడా ఒంటరిగా వెళ్లకూడదని తెలిపారు. కవ్వాల్‌ అటవీ ప్రాంతం మీదుగా పెద్దపులి ఈ ప్రాంతంలోకి వచ్చిందని..దానికి ఎవరు ఎలాంటి హాని తలపెట్టవద్దని అటవీ అధికారులు సూచించారు.