Site icon vidhaatha

Viral Video | యువతి జుట్టు పట్టుకున్న మగ గొరిల్లా.. ఇక ఆడ గొరిల్లా రియాక్షన్‌ చూడాలి…

Viral Video | ఎవరన్నా అమ్మాయిలవైపు భర్తలు చూస్తుంటే.. భార్యల్లో వచ్చే రియాక్షన్‌ ఎలా ఉంటుందో కొందరికి స్వానుభవంలో ఉండే ఉంటుంది. లేదా అలాంటి రియాక్షన్‌ తాలూకు వీడియోలు చూసినవారికి తెలిసే ఉంటుంది. ఇది మానవుల్లోనే మాత్రమే జరుగుతుందా? జంతు ప్రపంచంలోనూ ఉంటుందా? అనే సందేహం ఇప్పుడు ఈ వీడియో చూసినవారికి తలెత్తుతున్నది. జంతు ప్రపంచానికి సంబంధించిన అనేక వింతలు విశేషాలతో కూడి వైరల్‌ వీడియోలు నిత్యం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి. ప్రత్యేకించి మనుషులతో అవి ప్రవర్తించే తీరుకు సంబంధించినవి ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఈ వీడియో చూసినవారు తెగ నవ్వుల్లో మునిగిపోతున్నారు.

ఇది ఒక సఫారీలో తీసిన వీడియో. అందులో ఒక మగ గొరిల్లా ఒక సందర్శకురాలి జట్టు పట్టుకుని టీజ్‌ చేస్తున్నట్టు ఉంటుంది. కాసేపు ఇది కొనసాగిన తర్వాత ఎక్కడి నుంచో ఒక అడ గొరిల్లా దొర్లుకుంటూ వస్తుంది. అప్పటికి ఆ మగ గొరిల్లా ఆ అమ్మాయి జట్టును వదిలేసి ఆడ గొరిల్లా వైపు చూస్తుంది. రెండు మూడు క్షణాలు అలానే ఉన్న ఆడ గొరిల్లా.. ఇక చూసుకో.. అమ్మాయిలను ఏడిపిస్తావా? అంటూ పొట్టుపొట్టు కొట్టి.. ఈడ్చుకుపోతుంది. మానవుల తరహాలో ఆడ గొరిల్లా వ్యవహరించిన తీరు అక్కడున్నవారినే కాదు.. ఆ వీడియోను చూసిన అనేక మంది ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆ వీడియో ప్రారంభంలో ఒక మగ గొరిల్లా ఒక మహిళా టూరిస్టు వద్దకు వస్తుంది. ఆమె జట్టును పట్టుకుని టీజ్‌ చేస్తుంది. ఇప్పుడప్పుడే వదిలేట్టు కనిపించదు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న ఆడ గొరిల్లా.. నాటకీయంగా దొర్లుకుటూ మగ గొరిల్లా వద్దకు వస్తుంది. మగ గొరిల్లా వైపు కాసేపు అలానే చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి జట్టును మగ గొరిల్లా వదిలిపెట్టేసిన తర్వాత ఇక అసలు సీన్‌ మొదలవుతుంది. మగ గొరిల్లాను చెడామడా తిడుతున్నట్టు ఫేస్‌ పెట్టి వీరబాదుడు మొదలు పెడుతుంది. దీనిని అనేక మంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

దీనిపై నెటిజన్లు సరదా వ్యాఖ్యలతో కుమ్మేశారు. ఒక వ్యక్తి వాటి మధ్య ఎలాంటి సంభాషణ జరిగి ఉంటుందనే విషయాన్ని ఊహాత్మకంగా, హాస్యస్ఫోరకంగా రాశాడు. ‘ఆడ గొరిల్లా : వేరే ఆడ గొరిల్లా జట్టు పట్టుకోవడానికి నీకెంత ధైర్యం? మగ గొరిల్లా : అది ఆడ గొరిల్లా కాదు.. నువ్వు ఆడ గొరిల్లా. ఆడ గొరిల్లా : ఏంటీ? ఏయ్‌… రా నీ సంగతి చెబుతా’.. అని రాశాడు. ‘జాతి ఏదైనా ఆడవాళ్లు ఇటువంటి వాటిని సహిచబోరు’ అని మరొక యూజర్‌ స్పందించారు.  ‘అంతే..దానికి అది జరగాల్సిందే. పాపం ఆ ఆడ గొరిల్లా తలలో అందమైన ఆకులు పెట్టుకుని ఉన్నా.. ఇది మరొకరితో సరసాలాడుతున్నది’ అని ఇంకొకరు కామెంటారు. ‘అన్ని జాతులూ అంటే. మగజాతి సరసాలాడటం మానలేదు.. ఆడ జాతి ఉక్రోషాన్ని ఆపుకోలేదు’ అని ఒకరు అసలు విషయం బయటపెట్టారు.

ఇవి కూడా చదవండి..

Prisoner swallow’s Mobile | జైల్లో మొబైల్ ఫోన్‌ను మింగిన ఖైదీ.. బ‌య‌ట‌ప‌డిందిలా..!
Mole | అక్క‌డ పుట్టుమ‌చ్చ ఉందా..? మీ జీవితమంతా శృంగార‌భ‌రిత‌మే..!
ఎక్కడం ఎక్కింది కానీ, దిగరాలేదు.. ‘దున్నపోతు’ మొహందానికి..
పళ్లు – చిగుళ్లు బాగోలేకపోతే గుండెకు యమ డేంజర్​..!

Exit mobile version