Mole | అక్కడ పుట్టుమచ్చ ఉందా..? మీ జీవితమంతా శృంగారభరితమే..!
Mole | పుట్టుమచ్చలు( Moles ).. ఈ పేరు వినని వారు, తెలియని వారు ఉండరు. స్త్రీలకు అందాన్ని తీసుకొచ్చే ఈ పుట్టుమచ్చలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శరీరంలో ఆయా భాగాల్లో ఉండే పుట్టుమచ్చలతోవారి జీవితం( Life ) ముడిపడి ఉంటుందని, పుట్టుమచ్చలు భవిష్యత్‌ను నిర్ణయిస్తుంటాయని నమ్ముతుంటారు. అయితే అక్కడ పుట్టుమచ్చ ఉంటే.. వారు శృంగారభరితంగా ఉంటారని సాముద్రిక శాస్త్రం చెబుతుంది.

Mole | పుట్టుమచ్చలు( Moles ).. ఇవి ఆడమగ అనే తేడా లేకుండా అందరిలో ఎక్కడంటే అక్కడ ఉద్భవిస్తాయి. కొన్ని పుట్టుకతో వచ్చే పుట్టుమచ్చలు ఉంటాయి. మరికొన్ని శరీర ఎదుగుదలలో భాగంగా ఉద్భవిస్తుంటాయి. అయితే పుట్టుమచ్చలకు పురాతన భారతీయ శాస్త్రంలో అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఈ పుట్టు మచ్చలు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి భవిష్యత్‌ను అంచనా వేస్తాయని సాముద్రిక శాస్త్ర నిపుణులు చెబుతుంటారు.
అయితే శరీరంలో అనేక చోట్ల పుట్టుమచ్చలు ఉంటాయి. కానీ మోకాలి( Knee )పై ఉండే పుట్టుమచ్చలకు సాముద్రిక శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. మరి మోకాలిపై పుట్టుమచ్చ ఉంటే ఏమవుతుంది..? అక్కడ పుట్టుమచ్చలు ఉండడం మంచిదేనా..? ఒక వేళ ఉంటే ఏమవుతుంది.. అనే విషయాలు తెలుసుకుందాం..
మోకాలిపై పుట్టుమచ్చ ఉన్నవారు ఎవరైనా సరే.. కొత్త ప్రదేశాలను చూడాలని తాపత్రయపడుతుంటారు. కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఇష్టపడుతుంటారు. కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టం చూపిస్తుంటారు. విభిన్న సంస్కృతులు, ఆచారాల గురించి తెలుసుకోవడానికి వారు చాలా ఆసక్తిగా ఉంటారు.
మరి కుడి మోకాలిపై పుట్టుమచ్చ ఉంటే..?
కుడి మోకాలి( Right Knee )పై పుట్టుమచ్చ ఉంటే.. జీవితంలో ఎక్కువగా కష్టపడుతారు. నమ్మకం కలిగిన వారు కూడా. బాధ్యతగా వ్యవహరిస్తారు. జీవితంలో మంచి విజయం కూడా సాధిస్తారు. కుడి మోకాలిపై పుట్టుమచ్చ ఉన్నవారు.. తమ భాగస్వామిని, ప్రియమైన వారిని బాగా ప్రేమిస్తారు. వారికి విధేయులుగా కూడా ఉంటారు. ఇక వీరికి ఓపిక ఎక్కువ.. అర్థం చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో కుడి మోకాలిపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కఠినమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి వారికి అంత ఈజీగా లొంగరు.
మరి ఎడమ మోకాలిపై పుట్టుమచ్చ ఉంటే..?
ఎడమ మోకాలి( Left Knee )పై పుట్టు మచ్చ ఉంటే.. జీవితంలో ఎక్కడా కూడా సంకల్పాన్ని కోల్పోరు. ధృఢంగా ఉంటారు. ఎలాంటి సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. విజయం, లక్ష్యాలను సాధించేందుకు తమ శక్తిని కూడగడుతారు. ఎడమ మోకాలిపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తుల సంబంధాల గురించి మాట్లాడుకుంటే, వారు స్వభావరీత్యా శృంగారభరితంగా ఉంటారు. వారు తమ ప్రేమను వ్యక్తపరచాలనే బలమైన కోరికను కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులు తమ భాగస్వాములను చాలా ప్రేమిస్తారు.