Mole | కుడి బుగ్గపై పుట్టుమచ్చ.. ఆ బంధం బలంగా మారుతుందట..!
Mole | పుట్టు మచ్చలు( Mole ).. ఆడవారికి అందాన్ని తెస్తాయి. కానీ అవే పుట్టుమచ్చలు బంధాలను( relations ) కూడా బలోపేతం చేస్తాయట..! అమ్మాయిలకు( Girls ) అక్కడ పుట్టుమచ్చ ఉంటే ఆ బంధం బలంగా మారిపోతుందట..!
Mole | పుట్టుమచ్చలు( Mole ) అనేవి పుట్టుకతో వస్తాయి.. కొన్ని పుట్టుమచ్చలు శరీరం ఎదిగేకొద్ది అక్కడక్కడ ఉద్భవిస్తాయి.. కొన్ని మాయం అవుతుంటాయి. అయితే ఈ పుట్టుమచ్చలు మహిళలకు( Woman ) అందాన్ని తీసుకు రావడమే కాకుండా, అదృష్టాన్ని కూడా తీసుకొస్తాయని చెబుతున్నారు పండితులు. మరి ముఖ్యంగా మహిళలకు కుడి బుగ్గపై పుట్టు మచ్చ( Mole on Right Cheek ) ఉంటే.. ఎంతో మంచిదని, జీవితాంతం సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని పండితులు పేర్కొంటున్నారు. కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే.. ఏయే లక్షణాలు ఉంటాయో ఈ కథనంలో తెలుసుకుందాం..
కుడి బుగ్గపై పుట్టు మచ్చల వల్ల లాభాలివే..
- కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా బలమైన, ఆధిపత్య వ్యక్తిత్వంగా, తార్కిక, బుద్ధిపూర్వక విధానంతో ఉండాలనే ధోరణిని సూచిస్తుందట.
- కుడి బుగ్గపై ఉన్న పుట్టుమచ్చలు ఉన్న అమ్మాయిలు దయగల, ఉదారమైన స్వభావాన్ని కలిగి ఉంటారట.
- కుడి బుగ్గపై పుట్టుమచ్చ కారణంగా ప్రేమపూర్వక సంబంధాలు, బలమైన కుటుంబ బంధాలను కలిగి ఉంటారట.
- కుడి చెంపపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఆర్థిక విజయం, ఆర్థిక నిర్వహణలో బలమైన సామర్థ్యం కలిగి ఉంటారట.
- కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే, అది సామాజిక జీవితం, ప్రజా కార్యకలాపాలపై దృష్టి సారించే, స్నేహశీలియైన, బహిరంగ వ్యక్తిత్వాన్ని సూచిస్తుందట.
- కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్న వారు వినూత్నంగా ఆలోచిస్తారట. నాయకత్వం లక్షణాలు కలిగి ఉంటారట. ప్రజల్లో మంచి నాయకుడిగా పేరు పొందుతారని పండితులు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram